Movie News

అడ్రస్ లేకుండా పోయిన ‘బీస్ట్’

‘కేజీఎఫ్-2’ ప్రభంజనానికి భయపడి హిందీలో ‘జెర్సీ’ లాంటి క్రేజీ మూవీని వాయిదా వేసుకున్నారు దాని నిర్మాతలు. ముందు రిలీజ్‌కు ధైర్యం చేసినా.. విడుదల దగ్గర పడే సమయానికి వెనుకంజ వేశారు. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ‘కేజీఎఫ్-2’ ఊచకోత చూస్తుంటే.. ‘జెర్సీ’ని వాయిదా వేయడం సరైన నిర్ణయమే అని అంతా అంగీకరిస్తున్నారు. ఇగోకు పోకుండా సినిమాను వెనక్కి జరిపి మంచి పని చేశారంటున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ వసూళ్ల మోత మోగిస్తున్నా.. పట్టుదలకు పోయి ఈ నెల ఆరంభంలో ‘ఎటాక్’ అనే సినిమా రిలీజ్ చేస్తే అది దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి సినిమాలకు పోటీగా మంచి విషయం ఉన్న సినిమాలను దించితేనే కష్టం అంటే.. కంటెంట్ లేని వాటిని దించితే ఇంకేమైనా ఉందా? ‘ఎటాక్’ ఇలాగే అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు ‘బీస్ట్’ మూవీ పరిస్థితి కూడా ఇలాగే తయారైనట్లుగా కనిపిస్తోంది.

కొన్నేళ్లుగా విజయ్ సినిమాలు తమిళనాడు అవతల కూడా బాగా ఆడుతున్నాయి. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో మంచి వసూళ్లు వస్తున్నాయి. ఉత్తరాదిన కూడా అతడి సినిమాలు బాగానే ప్రభావం చూపిస్తున్నాయి. కానీ ‘బీస్ట్’ సినిమా మాత్రం తమిళనాడు సహా అన్ని చోట్లా చతికిలపడిపోయింది. అసలే కేజీఎఫ్-2తో పోటీ, పైగా సినిమాలో విషయం లేదు.. అలాంటపుడు ప్రేక్షకులు ఈ సినిమా చూడాలని ఎందుకు కోరుకుంటారు? ఫలితమే.. తమిళనాడు అవతల తొలి రోజు వరకు ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టి.. రెండో రోజు నుంచి కనుమరుగైపోయే పరిస్థితి తలెత్తింది.

నార్త్ ఇండియాలో, అలాగే సౌత్‌లో తమిళనాడు మినహా అన్ని చోట్లా ‘బీస్ట్’ పనైపోయినట్లే కనిపిస్తోంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తమిళనాట కూడా ‘కేజీఎఫ్-2’ దానికి ముప్పు తప్పేట్లు లేదు. విజయ్ స్టార్ ఇమేజ్ వల్ల వీకెండ్ వరకు సినిమా బాగానే ఆడొచ్చు కానీ.. ఆ తర్వాత నిలబడటం కష్టమే. ‘కేజీఎఫ్-2’కు కూడా కొంత డివైడ్ టాక్ ఉన్నప్పటికీ.. ఎలివేషన్లకు మాస్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పైగా ‘బీస్ట్’తో పోలిస్తే ఏ రకంగా అయితే ఇది మెరుగే కాబట్టి ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఇదే అవుతుంది కదా.

This post was last modified on April 15, 2022 6:14 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

46 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

1 hour ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago