ఏప్రిల్ 14న కేజీఎఫ్-2 రిలీజ్. 29న ఏమో ఆచార్య వస్తోంది. మధ్యలో ఖాళీగా ఉన్న వారాన్ని వాడుకోవడానికి ఏ పెద్ద, మీడియం రేంజ్ సినిమా కూడా ముందుకు రాలేదు. దీంతో ఆ వారంపై చిన్న సినిమాలు కన్నేశాయి. ఇదే మంచి ఛాన్స్ అన్నట్లు మూడు చిన్న చిత్రాలు ఆ వారానికి బెర్తులు బుక్ చేసుకున్నాయి. అందులో ఒకటి విశ్వక్సేన్ సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం అయితే.. ఇంకోటి నాగశౌర్య మూవీ కృష్ణ వ్రింద విహారి. మరొక చిత్రం.. సుమ ప్రధాన పాత్ర పోషించిన జయమ్మ పంచాయితీ.
ఈ మూడు చిత్రాలకూ కొన్ని వారాల ముందే రిలీజ్ డేట్లు ఖరారయ్యాయి. కొంచెం ఆర్భాటంగానే అనౌన్స్‌మెంట్లు ఇచ్చారు. ఈ దిశగా కొంత వరకు ప్రమోషన్లు కూడా చేశారు. కానీ ఉన్నట్లుండి ఈ మూడు చిత్రాల మేకర్స్ సైలెంట్ అయిపోయారు. కేజీఎఫ్-2 మేనియాకు భయపడే ఇదంతా.
ఆర్ఆర్ఆర్ సినిమా బాగా ఆడుతుండగా, ఇంకో వారంలో కేజీఎఫ్-2 రాబోతుండగా.. ధైర్యం చేసి గత వారం గని సినిమాను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఫలితం తెలిసిందే. జనాలు ఆ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రాక వరుణ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. పెద్ద సినిమాల మధ్య పడితే చిన్న, మీడియం సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఈ భారీ చిత్రాలను చూసేందుకు బాగా ఖర్చు పెడుతున్న ప్రేక్షకులు చిన్న సినిమాల కోసం పర్స్ తీయట్లేదు.
కేజీఎఫ్-2 హవా వారానికి పరిమితం అవుతుందా అన్నది చూడాలి. మరోవైపు ఇంకో వారం ఆగితేనేమో ఆచార్య వచ్చేస్తుంది. దాని మీదా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు పెద్ద సినిమాల మధ్య వస్తే ప్రేక్షకుల దృష్టిలో పడటం కష్టం. అందుకే 22వ తేదీకి షెడ్యూల్ అయిన మూడు చిత్రాలూ ప్రస్తుతానికి గప్ చుప్ అయిపోయాయి. కేజీఎఫ్-2 ఫైనల్ టాక్, బాక్సాఫీస్ పెర్ఫామెన్స్‌ను బట్టి వాటి రిలీజ్ ఆధారపడి ఉంటుంది.
This post was last modified on April 14, 2022 10:15 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…