కరోనా వైరస్ క్రైసిస్ లో సినిమా షూటింగ్స్ జరగడం లేదు. ఒకటీ అరా చిన్న సినిమాల షూటింగ్స్ మినహా టాలీవుడ్ ఇంకా లాక్ డౌన్ లోనే ఉంది. ప్రస్తుతం పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల షూటింగ్స్ పట్ల నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్ పై నిర్మాణ సంస్థలు దృష్టి పెడుతున్నాయి.
సురేష్ బాబు ఆ దిశగా ఆలోచన చేస్తున్నా కానీ కార్యాచరణలో పెట్టలేదు. గీత ఆర్ట్స్ కాంపౌండ్ లో మాత్రమే ఈ సందడి బాగా కనిపిస్తోంది. అల్లు అరవింద్ కి ఆహా స్ట్రీమింగ్ యాప్ ఉండడంతో కంటెంట్ కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రైసిస్ లో దర్శకులు కూడా ఓటిటీ ఇంపార్టెన్స్ తెలుసుకోవడంతో పలువురితో జూమ్ మీటింగ్స్ నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
త్వరలోనే ఆహా నుంచి అరడజను వెబ్ సిరీస్, ఒక పది చిన్న సినిమాలు మొదలు కానున్నాయి. దీనికి ప్రణాళిక జరిగిపోయింది. సినిమాలు మాములుగా చేసినా సరే, ఇకపై ఓటిటీ కోసం కంటెంట్ కూడా పెద్ద స్థాయిలో చేయబోతున్నారు. టాలీవుడ్ నుంచి ఈ ట్రెండ్ లో బిగ్ ప్లేయర్ అల్లు అరవింద్ కాబోతున్నారు.
This post was last modified on June 22, 2020 1:50 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…