అక్కినేని నాగచైతన్య, సమంతల జోడీ చాలా ముచ్చటగా అనిపించేది అభిమానులకు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా కనిపించిన ఆ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే విడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఈ వార్త ముందుగా బయటికి వచ్చినపుడు రూమర్ అనే అనుకున్నారు. నమ్మడానికి అభిమానులు ఇష్టపడలేదు. కానీ తర్వాత అదే నిజమని తేలింది.
ఈ వార్త బయటికి వచ్చి అప్పుడే ఆరు నెలలు దాటిపోయింది. ఇప్పటిదాకా విడాకుల గురించి, అందుకు దారితీసిన కారణాల గురించి బహిరంగ వేదికల్లో చైతూ కానీ, సమంత కానీ స్పందించలేదు. నాగచైతన్య తన లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల ప్రమోషన్ల టైంలో విడాకుల అంశం మీద ప్రశ్నలను దాటవేయడానికే చూశాడు. ఐతే విడాకుల నిర్ణయంతో తామిద్దరం సంతోషంగా ఉన్నట్లుగా మాత్రం మాట్లాడాడు.
సమంత ఇన్ డైరెక్టుగా ఇన్‌స్టా పోస్టులు పెట్టడం, వ్యాఖ్యలు చేయడం తప్ప ఈ వ్యవహారంపై నేరుగా ఇప్పటిదాకా స్పందించలేదు. ఆమెను ఈ విషయమై ప్రశ్నించడానికి మీడియాకు అవకాశం కూడా దక్కలేదు. ఐతే ఇప్పుడు సమంత సౌత్ మీడియా ముందుకు రాబోతోంది. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి ఆమె నటించిన కణ్మణి రాంబో ఖటీజా సినిమా ప్రమోషన్ల కోసం సమంత రంగంలోకి దిగుతోంది. ఈ చిత్రం నెలాఖర్లో విడుదల కానుంది.
ఈ మధ్య ముంబయిలో ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న సమంతకు అక్కడ విడాకుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. కష్టపడి సమాధానాలు దాటవేసింది. కానీ సౌత్ మీడియా ఆమెను అంత తేలిగ్గా వదలకపోవచ్చు. సమంత కూడా దీనికి ప్రిపరేయ్యే మీడియాను కలిసే ఛాన్సుంది. ఇప్పటిదాకా ఇన్ డైరెక్ట్‌గా విడాకుల విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సామ్.. ఇప్పుడు మీడియా ముందు ఈ వ్యవహారంపై ఓపెన్ అయిపోతుందేమో, సంచలన విషయాలేమైనా చెబుతుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?
This post was last modified on April 13, 2022 6:30 am
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…