కేజీఎఫ్: చాప్టర్ 2 మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి చాప్టర్-1 వివిధ భాషల్లో ఎంతటి సంచలన విజయం అందుకుందో తెలిసిందే. అప్పట్నుంచి సెకండ్ పార్ట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతకంతకూ అంచనాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. ఎట్టకేలకు ఆ చిత్రం థియేటర్లలోకి దిగుతోంది.
ఈ చిత్రాన్ని హిందీలో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూసి బెంబేలెత్తి షాహిద్ కపూర్ క్రేజీ మూవీ జెర్సీని కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఐతే తమిళ సినిమా బీస్ట్‌ను మాత్రం కేజీఎఫ్-2కు పోటీగా నిలబెట్టేశారు. ఒక దశలో ఈ చిత్రాన్ని కూడా వాయిదా వేస్తారని ప్రచారం జరిగింది.. విజయ్ ఉన్న ఫాంను చూసి నిర్మాతలు ధైర్యం చేసి కేజీఎఫ్-2 కంటే ఒక రోజు ముందు రిలీజ్‌కు సినిమాను రెడీ చేశారు.
ఐతే బీస్ట్ మూవీకి.. కేజీఎఫ్-2 దెబ్బ గట్టిగానే తగిలేలా ఉంది. కేజీఎఫ్-2 లేకుంటే తమిళనాడులో ఉన్న థియేటర్లన్నింటిలో బీస్ట్‌నే వేసేసేవాళ్లు. అక్కడ కేజీఎఫ్-2కు క్రేజ్ తక్కువగా ఏమీ లేదు. ఓ మోస్తరుగా దానికి స్క్రీన్లు ఇవ్వక తప్పని పరిస్థితి. మరోవైపు కేరళలోనూ విజయ్ సినిమాకు స్క్రీన్లు తగ్గేలా చేస్తోంది యశ్ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో అయితే బీస్ట్‌కు బాగానే గండికొడుతోంది కేజీఎఫ్-2.
బిగిల్, మాస్టర్ లాంటి చిత్రాలతో పోలిస్తే దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ కోసం బాగా ఖర్చు పెట్టారు తెలుగు ప్రేక్షకులు. మళ్లీ కేజీఎఫ్-2 కోసం పెద్ద బడ్జెట్టే పెట్టాల్సి వస్తోంది. దీంతో బీస్ట్ మీద అంతగా ఆసక్తి చూపించట్లేదు. కేజీఎఫ్-2, బీస్ట్ చిత్రాలు రెంటినీ నైజాం వరకు దిల్ రాజే రిలీజ్ చేస్తున్నాడు.
కేజీఎఫ్-2 బుకింగ్స్ ఆలస్యం చేసినా.. బీస్ట్ బుకింగ్స్ పుంజుకోలేదు. ఉదయమే ఐదో షో వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ రెగ్యులర్ షోలకే బుకింగ్స్ అంతంతమాత్రంగా ఉండటంతో చాలా థియేటర్లు ఆ అవకాశాన్నే ఉపయోగించుకోవడం లేదు. బుధవారం ఒక్క రోజైనా వీలైనంత మేర బీస్ట్ ద్వారా రాబట్టుకుందామంటే.. జనాల దృష్టి కేజీఎఫ్-2 నుంచి మళ్లడం లేదు. ఇక కర్ణాటక, అలాగే నార్త్ ఇండియాలో అయితే బీస్ట్ రిలీజ్‌ను నామమాత్రం చేసేసేలా ఉంది కేజీఎఫ్-2.
This post was last modified on April 12, 2022 7:06 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…