Movie News

అడ్రస్ లేకుండా పోతున్నాయ్.. చూసి దించండయ్యా

విజువల్ వండర్ అనదగ్గ ఒక భారీ చిత్రం రిలీజవుతుంటే.. దానికి ముందు, తర్వాతి వారాల్లో వచ్చే చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు పెద్ద ముప్పు పొంచి ఉన్నట్లే. ఆ భారీ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చి, అవి ప్రేక్షకులకు టాప్ లెవెల్ వినోదాన్ని అందిస్తే.. ప్రేక్షకులకు వేరే సినిమాలు అసలు ఆనవు.

ఎంటర్టైన్మెంట్లో పీక్స్‌ చూడబోతున్నాం అన్నపుడు అప్పటికే థియేటర్లలో ఉన్న సినిమాల మీద ఆసక్తి ఉండదు. ఇక ఆ సినిమా చూశాక అదే ట్రాన్స్‌లో ఉంటారు. కొత్తగా వచ్చే సినిమాల మీదికి దృష్టి మళ్లడం కష్టం. వాటికి అదిరిపోయే టాక్ వస్తే తప్ప ఆదరణ దక్కడం కష్టమే. అందులోనూ ఈ మధ్య ప్రేక్షకులు ఆషామాషీ సినిమాలు చూడటానికి థియేటర్లకు రావట్లేదు. కరోనా టైంలో ఓటీటీలకు అలవాటు పడిపోయారు. పెద్ద తెర మీద చూడాల్సిందే అనదగ్గ చిత్రాలకు మాత్రమే థియేటర్లకు కదులుతున్నారు. టికెట్ల ధరలు పెరిగిపోయి థియేటర్ వినోదం ఖరీదైపోయింది కూడా.

ఈ నేపథ్యంలో ఓ పెద్ద సినిమాకు ఎక్కువ ఖర్చు పెట్టేశాక.. మామూలు సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్లడం కష్టమైపోతోంది. ఈ నేపథ్యంలోనే ‘ఆర్ఆర్ఆర్’కు, ముందు తర్వాత వచ్చిన సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాలు దక్కాయి. ముందు వారం రిలీజైన ‘స్టాండప్ రాహుల్’, తర్వాతి వారాల్లో వచ్చిన మిషన్ ఇంపాజిబుల్, గని సినిమాలు వాషౌట్ అయిపోయాయి. మామూలగా చూస్తే ఇవి మరీ అంత దారుణమైన ఫలితాలు అందుకోవాల్సిన సినిమాలు కావు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్ వాటి మీద గట్టిగానే పడింది.

ముందేమో ‘ఆర్ఆర్ఆర్’ చూడబోతూ ‘స్టాండప్ రాహుల్’కు ఏం వెళ్తామనుకున్నారు. ఆ తర్వాతేమో ‘ఆర్ఆర్ఆర్’ ఆడుతుండగా.. మిషన్ ఇంపాజిబుల్, గని చిత్రాలను ఏం చూస్తాంలే అనుకున్నారు. ఈ సినిమాలకు టాక్ చాలా బాగున్నా కూడా ప్రేక్షకులు థియేటర్లకు ఏమాత్రం వెళ్లేవారో అన్న డౌట్లున్నాయి. అలాంటిది అన్నింటికీ నెగెటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు పూర్తిగా వాటిని పట్టించుకోలేదు. కాబట్టి ఇకముందైనా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రాలు రిలీజవుతున్నపుడు ముందు, వెనుక వారాల్లో సినిమాలను రిలీజ్ చేసే విషయంలో జాగ్రత్త పడాల్సిందే. మరీ ‘ఆర్ఆర్ఆర్’ స్థాయిలో ఉండకపోయినా బలమైన కంటెంట్ ఉండి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలదు అనుకుంటనే రిలీజ్ చేయాలి. లేదంటే ఊరుకోవడం బెటర్.

This post was last modified on April 11, 2022 4:34 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

46 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

54 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago