మెగా ఫ్యామిలీ యువ కథానాయకుడు వరుణ్ తేజ్ చివరి సినిమా గద్దలకొండ గణేష్ 25 కోట్లకు పైగానే షేర్ రాబట్టింది. అంతకుముందు అతడి కెరీర్లో ఫిదా, తొలి ప్రేమ లాంటి మంచి విజయాలున్నాయి. వెంకటేష్‌తో కలిసి నటించిన ఎఫ్-2 సైతం పెద్ద హిట్టే అన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఒక స్థాయిలో ఉన్న హీరోనే అతను. ఇప్పటిదాకా అతడి సినిమాలకు ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడి కొత్త చిత్రం గని మీద కొత్త నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్ద 30 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టేశారు.
ఈ సినిమా తీసిన కిరణ్ కొర్రపాటి కొత్త దర్శకుడైనా సరే.. నిర్మాతలు ధైర్యం చేశారు. సినిమా మీద అందరూ చాలా నమ్మకంగా ఉన్నట్లే కనిపించింది. టాక్ ఎలా ఉన్నా సరే.. ఓపెనింగ్స్ బాగానే వస్తాయని అనుకున్నారు. బిజినెస్ కూడా బాగానే జరిగింది. సొంతంగా రిలీజ్ చేసిన ఏరియాలతో కలిపితే మొత్తంగా థియేట్రికల్ హక్కుల వాల్యూ రూ.27 కోట్లు కావడం గమనార్హం.
ఐతే ఇప్పుడు ఈ మొత్తంలో పదో వంతుకు మించి గని షేర్ వసూలు చేసే పరిస్థితి లేకపోవడం విస్మయానికి గురి చేస్తున్న విషయం. ఆర్ఆర్ఆర్ తర్వాత, కేజీఎఫ్-2కు ముందు ఏమాత్రం అనుకూలంగా లేని సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేయడం పెద్ద మైనస్ కాగా.. సినిమాకు బ్యాడ్ టాక్ రావడం మరింత ప్రతికూలమైంది. మొత్తానికి గనికి బాక్సాఫీస్ దెబ్బ మామూలుగా లేదు. కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ లేక, తొలి రోజే థియేటర్లు వెలవెలబోయాయి.
వీకెండ్ కదా పుంజుకుంటుందిలే అని ఆశిస్తే.. శని, ఆదివారాల్లో కూడా పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. అసలు ఈ సినిమా రిలీజైన సంగతే జనాలు గుర్తించట్లేదు. కోరుకున్నన్ని థియేటర్లు దొరికినా.. వసూళ్లు లేక, షోలు క్యాన్సిల్ చేసి ఆర్ఆర్ఆర్‌నే ఆడించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఫుల్ రన్లో కనీసం రూ.3 కోట్ల షేర్ రాబట్టలేని స్థితిలో గని వరుణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్‌గా నిలవబోతోంది. ఎంత నెగెటివ్ టాక్ వచ్చినా సరే.. సినిమా పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు.
This post was last modified on April 11, 2022 10:17 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…