గని సినిమా కోసం యువ కథానాయకుడు వరుణ్ తేజ్ మామూలు కష్టం పడలేదు. శారీరకంగానే కాక మానసికంగానూ అతను ఈ సినిమా కోసం పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదు. ఈ సినిమా కోసం అతను సిక్స్ ప్యాక్ బాడీలోకి మారాడు. భారీ కాయుడైన వరుణ్ ఆ లుక్‌లోకి మారడం అంత తేలికైన విషయం కాదు. ఇక కరోనా, ఇతర కారణాల వల్ల సినిమా విపరీతమైన ఆలస్యం జరిగి వరుణ్ కెరీర్లో విలువైన మూడేళ్ల సమయం గని కోసం వెచ్చించాల్సి వచ్చింది.
కానీ ఇంత కష్టపడి ఫలితం లేకపోయింది. గని అంచనాలకు తగ్గట్లు లేదంటూ పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు. రిలీజ్ ముంగిటే బజ్ అంతంతమాత్రం కాగా.. నెగెటివ్ టాక్ రావడంతో గనికి కలెక్షన్ల కటకట తప్పట్లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ సరిగా లేకపోవడంతో ముందే చిత్ర బృందం డల్లయిపోయింది. ఇక టాక్ బాగా లేకపోవడంతో కలెక్షన్లు పుంజుకునే అవకాశమే కనిపించడం లేదు. కనీసం వీకెండ్ వరకు కూడా గని చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టే పరిస్థితి లేకపోయింది. దీంతో ఈ సినిమా కోసం కేటాయించిన థియేటర్లు, స్క్రీన్లను తిరిగి ఆర్ఆర్ఆర్ కోసం వెనక్కి తీసుకోవాల్సి వస్తోంది.
శుక్రవారం సాయంత్రం నుంచే గని థియేటర్లు వెలవెలబోవడం మొదలైంది. దీంతో రెండో రోజుకే దీనికి మల్టీప్లెక్సుల్లో స్క్రీన్లు, షోలు తగ్గిపోయాయి. సింగిల్ స్క్రీన్లలో వెంటనే మార్చలేరు కాబట్టి వీకెండ్ వరకు ఆగక తప్పట్లేదు. వీకెండ్ తర్వాత అయితే గని అస్సలు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు.
మూడో వీకెండ్లోనూ ఆర్ఆర్ఆర్‌కు మంచి డిమాండ్ ఉండడటంతో మాగ్జిమం షోలు దానికే కేటాయించి వసూళ్ల పంట పండించుకుంటున్నారు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు. గత వారం వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ కూడా కనీస ప్రభావం చూపించకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఆర్ఆర్ఆర్‌యే లీడ్ తీసుకుంది. హిందీలో సైతం ఆ సినిమాకు అసలు ఎదురన్నదే కనిపించడం లేదు. బీస్ట్, కేజీఎఫ్ వచ్చే వరకు ఆర్ఆర్ఆర్ మోత కొనసాగేలా ఉంది.
This post was last modified on April 10, 2022 9:08 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…