బిగ్గర్ దాన్ బచ్చన్.. ‘వీక్’ నేషనల్ వీక్లీ 90వ దశకంలో చిరు ముఖచిత్రంతో ఈ హెడ్డింగ్ పెట్టి ఎడిషన్ రిలీజ్ చేసింది. ఆ ఎడిషన్లో కవర్ స్టోరీ చిరంజీవి మీదే. దేశవ్యాప్తంగా అభిమానగణం, తిరుగులేని మార్కెట్ ఉన్న అమితాబ్ బచ్చన్ కంటే.. కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన ఇండస్ట్రీలో హీరో అయిన చిరంజీవి ఎక్కువ అని ఒక నేషనల్ వీక్లీ కవర్ స్టోరీ, ముఖచిత్రం వేయడమంటే మామూలు విషయం కాదు.
ఇది మాట వరసకు పెట్టిన హెడ్డింగ్ కూడా కాదు. ‘ఘరానా మొగుడు’ సినిమాతో మెగా హిట్ అందుకుని అప్పట్లోనే తర్వాతి చిత్రానికి రూ.1.25 కోట్లు తీసుకోవడం ద్వారా పారితోషకం పరంగా ఇండియాలో నంబర్ వన్ హీరోగా ఉన్న బిగ్-బిని దాటేసి చరిత్ర సృష్టించడంతో ‘వీక్’ ఆ కవర్ స్టోరీని ప్రచురించింది. చిరు రేంజ్ అంతగా పెరగడానికి కారణమైన ‘ఘరానా మొగుడు’ చిత్రానికి శనివారంతో 30 వసంతాలు పూర్తి కావడం విశేషం.ఇప్పుడంటే వందల కోట్ల కలెక్షన్ల గురించి చాలా తేలిగ్గా మాట్లాడేస్తున్నాం కానీ.. 90వ దశకంలో ఐదారు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే దాన్నో అద్భుతంగా చూస్తున్న రోజులవి.
అలాంటి సమయంలో ఏకంగా రూ.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ విస్మయానికి గురి చేసిన సినిమా ‘ఘరానా మొగుడు’. తమిళంలో రజినీకాంత్-విజయశాంతి జంటగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ‘మన్నన్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమిళ వెర్షన్ షూటింగ్ టైంలోనే రీమేక్ హక్కులు తీసుకుని.. దాంతో సమాంతరంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకోవడం విశేషం.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో పరుచూరి సోదరుల రచనలో చిరు-నగ్మా జంటగా తెరకెక్కిన ఈ చిత్రం.. తమిళ వెర్షన్‌ను మించి కమర్షియల్ హంగులతో, చిరు మార్కు ఫైట్లు, డ్యాన్సులు, మేనిజమ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించి సెన్సేషనల్ హిట్ అయింది. కలెక్షన్ల పరంగా, 100 డేస్ సెంటర్ల పరంగా అప్పటి రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. విడుదలైన 39 కేంద్రాల్లోనూ వంద రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ‘ఘరానా మొగుడు’లో చిరు పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ముఖ్యంగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అన్న మేనరిజం, స్టైల్‌గా నమస్తే పెట్టే తీరు అప్పట్లో అభిమానులను ఒక ఊపు ఊపేశాయి. ఇక బంగారు కోడిపెట్ట, ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్లు, పండు పండు లాంటి పాటలకు కీరవాణి సంగీతం.. చిరు స్టెప్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు చూసినా చిరు ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ఇచ్చే సినిమా ఇది.మెగాస్టార్ చిరంజీవి
This post was last modified on April 9, 2022 7:36 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…