ఆర్ఆర్ఆర్ ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. వారం తిరిగేసరికి కేజీఎఫ్, బీస్ట్ సినిమాలు రాబోతున్నాయి. ఇలాంటి భారీ చిత్రాల మధ్యలో బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమైంది వరుణ్ తేజ్ గని సినిమా. ఈ సినిమా అతడితో పాటు చాలామంది కెరీర్లకు చాలా ముఖ్యమైంది. వరుణ్ మార్కెట్ స్థాయిని మించి, భారీ బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా కోసం ఏకంగా మూడేళ్లు సమయాన్ని వెచ్చించాడు వరుణ్.
కరోనా సహా వేరే కారణాల వల్ల కూడా సినిమా ఆలస్యమైంది. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు.. ఇలా పెద్ద తారాగణమే ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ భారమంతా వరుణే మోయాల్సి ఉంది. తన స్టార్ పవర్‌ను చూపించాల్సిన సమయమిది. ఇక ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న కిరణ్ కొర్రపాటికి తొలి విజయం సాధించడం చాలా అవసరం.
కొత్త దర్శకుడు అయినప్పటికీ రాజీ లేకుండా ఈ సినిమాను నిర్మించిన, ఎంతో కష్టపడ్డ వరుణ్‌కు మంచి ఫలితాన్ని అందించాల్సిన బాధ్యత అతడిపై ఉంది. ఇక ఈ చిత్రంతోనే అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ పూర్తి స్థాయిలో నిర్మాతగా మారుతున్నాడు. అతడి కజిన్ సిద్ధు ముద్దకు కూడా నిర్మాతగా ఇదే తొలి చిత్రం. మరోవైపు బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ గనితోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది.
తెలుగులో ప్రత్యేక పాత్రలు పోషించిన ఏ చిత్రాలతోనూ విజయాలందుకోని ఉపేంద్ర, సునీల్ శెట్టిలకు కూడా ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరమే. మరి ఇంతమందికి కీలకంగా మారిన గనికి శుక్రవారం ఉదయం ఎలాంటి టాక్ వస్తుందో.. ఆర్ఆర్ఆర్ పోటీని తట్టుకుని వీకెండ్లో ఏమేర వసూళ్లు రాబడుతుందో.. వచ్చే వారం రెండు క్రేజీ చిత్రాలు వచ్చేలోపు బయ్యర్లు ఎంతమేర సేఫ్ జోన్లోకి తీసుకొస్తుందో చూడాలి.
This post was last modified on April 8, 2022 4:10 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…