పెద్ద హీరోలు కలిసి మల్టీస్టారర్లు చేయకపోతేనేమో.. వాళ్లకు ఇగోలెక్కువ, బాలీవుడ్లో మాదిరి ఎందుకు మన స్టార్లు చేతులు కలపరు.. కొత్త కథలకు అవకాశమివ్వరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు ప్రేక్షకులు. కానీ ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి సినిమా చేయడానికి సిద్ధమైతేనేమో.. ఆ చిత్రంలో ఎవరెక్కువ హైలైట్ అవుతారు.. ఎవరికెన్ని పాటలు, ఫైట్లు.. ఏ పాత్రకు ప్రాధాన్యం ఎక్కువ అంటూ తూకాలు వేసి మాట్లాడటం మొదలుపెడతారు. ఆర్ఆర్ఆర్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లు, పైగా తెలియని ఒక వైరం ఉన్న రెండు పెద్ద సినీ కుటుంబాలకు చెందిన హీరోలు కలిసి సినిమా చేయడానికి రెడీ అయితే దీన్నొక సెలబ్రేషన్ లాగా భావించి.. వారి కలయికలో సినిమాను ఆస్వాదించడానికి సిద్ధమవ్వాలి. అందులోనూ రాజమౌళి సినిమాలో వీళ్లిద్దరూ హీరోలుగా నటిస్తున్నందుకు మరింత సంతోషించాలి. హీరోల్లాగే అభిమానులు కూడా చేతులు కలిపి ఈ మెగా మూవీని బ్రహ్మరథం పట్టాలి.
కానీ ఆర్ఆర్ఆర్ అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి తారక్, చరణ్ అభిమానులకు కొట్టుకోవడమే సరిపోయింది. ఏ ప్రోమో రిలీజైనా ఎవరెక్కువ, ఎవరు తక్కువ అని వాదించుకోవడానికే పరిమితం అయ్యారు. ఇక సినిమా రిలీజయ్యాక ఈ చర్చ మరింత ముదిరింది. పాత్ర పరంగా చరణ్‌ది కొంచెం హైలైట్ అయ్యేసరికి తారక్ అభిమానులు ఫీలవడం, రాజమౌళిని నిందించడం, మరోవైపు చరణ్ అభిమానులు కవ్వించడం.. ఇలా రెండు వారాలుగా ఎడతెగని డిస్కషన్ నడుస్తోంది ఈ టాపిక్ మీద. చివరికిది నార్త్ జనాల్లోకి కూడా వెళ్లిపోయింది. ఈ సోషల్ మీడియా చర్చలకు ప్రభావితం అయిన ఓ ముంబయి జర్నలిస్ట్.. ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో అడగకూడని ప్రశ్న అడిగింది.
సినిమాలో చరణ్ డామినేషన్ గురించి ప్రస్తావించింది. దీనికి ఇటు చరణ్, అటు తారక్ ఇద్దరూ ఇబ్బంది పడ్డారు. రాజమౌళి సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈ వీడియో బయటికి వచ్చాక మళ్లీ సోషల్ మీడియాలో చరణ్, తారక్ అభిమానుల మధ్య వాగ్వాదాలు నడుస్తున్నాయి. మొత్తానికి అభిమానులు ఈ పోలికలతో అర్థం లేని చర్చలు, వివాదాలు తీసుకొస్తుండటంతో రేప్పొద్దున ఇలాంటి మల్టీస్టారర్లు చేయడానికి హీరోలు సంకోచించడం ఖాయం. ఒకవేళ చేసినా కథ, పాత్రలకు సరెండర్ కాకుండా అభిమానులను దృష్టిలో ఉంచుకుని వాళ్లు కూడా కొలతలు, తూకాల గురించి ఆలోచిస్తారేమో.
This post was last modified on April 8, 2022 11:40 am
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…