నేచురల్ స్టార్ నాని నుంచి రాబోతున్న కొత్త చిత్రం.. అంటే సుందరానికి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి వైవిధ్యమైన చిత్రాలతో తన అభిరుచిని, ప్రతిభను చాటుకున్న యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటి, ఫాహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజ్రీన్ కథానాయికగా నటిస్తోంది.
మొత్తంగా క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ భలే ఫన్నీగా ఉండి అందరినీ ఆకట్టుకుంది. ఇక అంటే సుందరానికి టీం పాటల ప్రమోషన్ మొదలుపెట్టింది. సినిమా నుంచి ముందుగా పంచెకట్టు అనే పాటను లాంచ్ చేశారు. దీని ప్రోమో చూసి పాట మీద అంచనాలు పెరిగాయి. రాజ రాజ చోర దర్శకుడు హాసిత్ గోలి ఈ పాట రాయగా.. ప్రముఖ గాయని, పద్మశ్రీ అవార్డు గ్రహీత అరుణ సాయిరాం ఈ పాటను ఆలపించడం విశేషం. ప్రోమో చూసి ఎంతో ఊహించుకున్న శ్రోతలను ఈ పాట అనుకున్నంతగా ఆకట్టుకోవడం లేదు.
అంత పెద్ద గాయనితో పాట పాడించారంటే ఆమె గానం ఎలా ఉంటుందో అని ఆసక్తిగా చూస్తే.. అసలు వాయిస్సే వినిపించకుండా వాయిద్యాలతో హోరెత్తించేశాడు సంగీత దర్శకుడు వివేక్ సాగర్. మామూలుగా అతను తన పాటల్లో గాత్రం బాగా వినిపించేలాగే చూసుకుంటాడు. వాయిద్యాల హోరు ఈ స్థాయిలో ఉండదు. కానీ ఈ పాట అందుకు భిన్నం.
ఒక లెజెండరీ సింగర్‌తో పాట పాడిస్తూ.. ఆమె గొంతును గౌరవించినట్లే అనిపించలేదు. లిరిక్స్ సైతం గందరగోళంగా అనిపించాయి. ఏం రాశారో.. ఏం పాడారో.. ఏం కంపోజ్ చేశారో అని అయోమయానికి గురయ్యేలా ఉందీ పాట. ఏదో ప్రయోగాత్మకంగా చేయాలని ప్రయత్నిస్తే అది బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది. వినగా వినగా ఏమైనా ఈ పాట ఎక్కుతుందేమో కానీ.. ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రం గోల గోలగా అనిపిస్తోంది.
This post was last modified on April 7, 2022 6:24 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…