రామ్ గోపాల్ వర్మకు ఒకప్పుడు కోట్లమంది అభిమానులు ఉండేవారు. వారిలో చాలామందిని కేవలం అభిమానులు అనడంకంటే.. భక్తులు కూడా అనొచ్చేమో. కేవలం పోస్టర్ మీద రామ్ గోపాల్ వర్మ పేరు చూసి.. హీరో హీరోయిన్లెవరో కూడా చూడకుండా థియేటర్లకు పరుగులు పెట్టేవారు ఒకప్పటి యూత్. ఒక దశ దాటాక వర్మ ఫాం కోల్పోయినా.. కొన్ని పేలవమైన సినిమాలు తీస్తున్నా సరే.. ఆయన్ని నమ్మి థియేటర్లకూ వెళ్తూనే ఉన్నారు కొన్నేళ్ల వరకు.
కానీ గత దశాబ్ద కాలంలో వర్మ దర్శకుడిగా ఎంత పతనం అయిపోయాడో.. ఎంత నాసిరకం సినిమాలు తీస్తున్నాడో తెలిసిందే. ఇప్పుడు ఆయన్నుంచి ఖత్రా-డేంజరస్ (తెలుగులో మా ఇష్టం) అనే సినిమా వస్తోంది. ఇది ఇద్దరు లెస్బియన్ ల మధ్య నడిచే గాఢమైన ప్రేమ కథ. దీని ప్రోమోలు చూస్తే ఇదొక బి-గ్రేడ్ సినిమాలా కనిపిస్తోంది. ఒకప్పటి వర్మ వీరాభిమానులు కూడా ఆయన ఇలాంటి సినిమా తీయడం జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో మీడియా వాళ్లు వర్మను ఇదే విషయమై ప్రశ్నించారు. మీ స్థాయికి తగ్గ సినిమాలు తీయట్లేదనే మాటకు మీరేమంటారు అని అడిగితే ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘‘నన్ను ఆసక్తికి గురి చేసిన అంశంతోనే నేను సినిమా చేస్తా. అది పది మంది కోసమా వంద మంది కోసమా అన్నది నా ఇష్టం. ఎంత బాగుంది, ఎంతమంది చూశారనే దాని కంటే ఎంతలో తీశారు ఎంత వచ్చిందనే విషయమే లాభాల్ని నిర్ణయిస్తుంది.
నేను తీసిన సినిమాలన్నీ నాకు లాభాలు తెచ్చిపెట్టినవే. అందుకే ఇంకా సినిమాలు చేయగలుగుతున్నా. నేను ఆశించిన ఫలితం నాకు వస్తోంది. పెద్ద స్టార్లు, పెద్ద బడ్జెట్లో సినిమాలు తీసే ఓపిక, సామర్థ్యం, తపన నాకు లేవు. నా సినిమాలను చూసి ఎలా ఉండేవాడు ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేవాళ్లు ఉంటారు. ఎవరైతే ఆ మాటలు అంటారో వాళ్లు పుట్టినప్పటి నుంచి బావిలో నుంచి బయటికి రాలేదన్నది నా అభిప్రాయం’’ అంటూ ఎప్పట్లాగే సమాధానం ఇచ్చాడు వర్మ.
This post was last modified on April 7, 2022 5:13 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…