మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ అవకాశం వస్తే ఏ దర్శకుడూ దాన్ని వదులుకోవడానికి ఇష్టపడడు. అందులోనూ చిరు కెరీర్ పీక్స్‌లో ఉన్న 90వ దశకంలో ఆయన సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం ఒక యువ దర్శకుడికి వస్తే కాదని అంటాడా? ఐతే ‘ఓం’ సినిమాతో కన్నడ నాట సంచలనం రేపి, అదే సినిమాను తెలుగులో రీమేక్ చేసిన దర్శకుడు, ఆ తర్వాత హీరోగా స్థిరపడ్డ ఉపేంద్ర ఈ అవకాశాన్ని విడిచిపెట్టాడట.
‘ఓం’ సినిమాను ‘ఓంకారం’ పేరుతో తెలుగులో తీస్తున్న సమయంలోనే చిరంజీవితో పని చేసే అవకాశం తన వద్దకు వచ్చిందని, అగ్ర నిర్మాత అశ్వినీదత్ తమ కలయికలో ఈ సినిమాను నిర్మించాలనుకున్నారని.. కానీ కొన్ని కారణాల వల్ల తాను ఆ సినిమా చేయలేకపోయానని, ఇప్పటికీ అందుకు చింతిస్తుంటానని తాను కీలక పాత్ర పోషించిన ‘గని’ సినిమా రిలీజ్ ఈవెంట్ లో ఉపేంద్ర చెప్పాడు.
ఐతే చిరుతో ఛాన్స్ మిస్సయినా.. మెగాస్టార్ ఫ్యామిలీతో మాత్రం తన అనుబంధం కొనసాగుతోందని ఉపేంద్ర చెప్పాడు.ఎ, ఉపేంద్ర సినిమాలతో గుర్తింపు సంపాదించాక తాను తెలుగులో హీరోగా నటించిన సినిమాల్లో ఒకటైన ‘ఒకేమాట’లో నాగబాబుతో స్క్రీన్ షేర్ చేసుకున్నానని.. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కీలక పాత్ర పోషించానని.. ఇప్పుడు వరుణ్ తేజ్‌తో ‘గని’లో నటించే అవకాశం వచ్చిందని చెప్పాడు ఉపేంద్ర. ఈ సినిమా కథను దర్శకుడు కిరణ్ తనకు పది నిమిషాల్లో చెప్పగా, తాను పది సెకన్లు కూడా ఆలోచించకుండా ఓకే చేశానని.. ఆ రోజు ఈ సినిమా మీద తనకు ఎంత నమ్మకం కలిగిందో ఇప్పుడు ట్రైలర్ చూస్తే విజయం మీద అంతే నమ్మకం కలుగుతోందని ఉపేంద్ర అన్నాడు.
ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ మామూలు కష్టం పడలేదని.. అంతటి భారీ ఆహార్యం ఉన్న వ్యక్తి ఇలా మారడం అసాధారణ విషయమని, వరుణ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం తాను చూశానని, ఆ సినిమాకు ఈ సినిమాకు వరుణ్ లుక్ పరంగా పోలికే లేదని ఉపేంద్ర అన్నాడు. కన్నడలో చాలా పెద్ద స్టార్ అయి ఉండి, తెలుగులోనూ మంచి గుర్తింపు ఉండి కూడా తన ప్రసంగంలో ఆద్యంతం వరుణ్ సహా తనకంటే చాలా చిన్న వాళ్లయిన అందరినీ ఉపేంద్ర సార్ అంటూ చాలా వినమ్రంగా మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.
This post was last modified on April 7, 2022 1:06 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…