బాహుబలి సినిమా సక్సెస్ తాలూకు మేజర్ క్రెడిట్ కచ్చితంగా రాజమౌళికే చెందుతుంది. కానీ ఈ సినిమాతో రాజమౌళికి ఎంత పేరొచ్చిందో, ఆయన మార్కెట్ ఎంత పెరిగిందో.. హీరో ప్రభాస్‌కు సైతం అంతే గుర్తింపు వచ్చింది, అలాగే మార్కెట్ కూడా అసాధారణంగా పెరిగింది. ఈ విషయంలో ప్రభాస్‌ను చూసి వేరే హీరోలు అసూయ చెందే పరిస్థితి కూడా వచ్చింది. ఇక ప్రభాస్ అభిమానులైతే సోషల్ మీడియాలో కాస్త ఎక్కువ హడావుడే చేశారు బాహుబలి తర్వాత.
రికార్డుల చర్చ వచ్చినపుడల్లా ప్రభాస్ అభిమానులతో వేరే హీరోల ఫ్యాన్స్ ఢీకొట్టడం కొంచెం కష్టంగా ఉండేది. ఐతే ఇప్పుడు ఆ ఫ్యాన్స్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేశాడు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్.. ఇలా తన స్థాయికి ఏమాత్రం తగని సినిమాలు చేసి దేశవ్యాప్తంగా అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బ తీశాడు. సాహోకైనా భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి, మాస్-యాక్షన్ ప్రియులైనా ఆ సినిమాను మెచ్చారు. కానీ రాధేశ్యామ్ అన్ని రకాలుగా, అందరినీ నిరాశకే గురి చేసింది.
బాహుబలి-2తో పోలిస్తే.. రాధేశ్యామ్‌కు వచ్చిన వసూళ్లు ఆరింట ఒక వంతు కూడా లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల బాహుబలి విజయంలో ప్రభాస్ పాత్ర ఎంత అనే విషయంలో ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్.. అతడి అభిమానుల్ని గిచ్చుతున్నారు. మరోవైపు బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్‌తో తన సత్తాను మరోసారి చాటి చెప్పాడు. కంటెంట్ పరంగా కొంచెం వీక్ అయినప్పటికీ.. బాహుబలి స్థాయిలో ఇది విజయం సాధిస్తోందంటే అది పూర్తిగా జక్కన్న మ్యాజిక్కే.
దీంతో హీరోలను మించిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ రాజమౌళి సొంతమని మరోసారి రుజువైంది. ప్రభాస్ కొత్త సినిమా చతికిలబడ్డ సమయంలోనే జక్కన్న కొత్త చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తుండటంతో.. ప్రభాస్ విలువ మరింత తగ్గి, జక్కన్న హోదా మరింత పెరిగింది. దీంతో బాహుబలి విజయంలో మేజర్ క్రెడిట్ జక్కన్నకే సొంతం అని, ఈ సినిమాతో అనుకోకుండా ప్రభాస్ పెద్ద స్టార్ అయిపోయాడనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తపరుస్తున్నారు.
This post was last modified on April 7, 2022 11:27 am
వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పనిచేస్తోందని ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే టీడీపీ యువనాయకుడు,…
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…