Movie News

‘జెర్సీ’ మేకర్స్‌లో భయం

బాలీవుడ్లో ఈ మధ్య విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ సినిమాలపై పెట్టుకున్న అంచనాలు తారుమారు అయిపోతున్నాయి. బాగా ఆడతాయనుకున్న సినిమాలు దెబ్బ తింటున్నాయి. అంచనాల్లేని సినిమాలు అనూహ్యంగా ఆడేస్తున్నాయి. ఎక్కువ అంచనాలు పెట్టుకున్న సినిమాలను అంచనాల్లేని సినిమాలు దెబ్బ కొడుతుండటం ఇక్కడ చర్చనీయాంశం. డిసెంబరులో ఉత్తరాది ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూసింది ‘83’ సినిమా కోసమే. అది 1983 వరల్డ్ కప్ విజయం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా, పైగా రణ్వీర్ సింగ్-దీపికా పదుకొనే సహా భారీ తారాగణం నటించిన చిత్రం, కబీర్ ఖాన్ లాంటి పెద్ద దర్శకుడు రూపొందించాడు.

కానీ ఈ భారీ అంచనాలున్న సినిమా.. ఏదో మొక్కుబడిగా రిలీజవుతున్నట్లు కనిపించిన ‘పుష్ప’ దెబ్బకు విలవిలలాడింది. మంచి టాక్ తెచ్చుకున్న  ‘83’ని పక్కకు నెట్టేసి ఆ సినిమా ఉత్తరాది బాక్సాఫీస్‌ను ఊపేసింది. భారీ వసూళ్లు తెచ్చుకుంది.ఆ తర్వాతేమో ‘కశ్మీర్ ఫైల్స్’ అనే చిన్న సినిమా అక్కడ సంచలనం రేపింది. అందరూ మార్చిలో అక్షయ్ కుమార్ సినిమా ‘బచ్చన్ పాండే’ కోసం ఎదురు చూస్తుంటే.. వారం ముందు వచ్చిన ‘కశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్‌లో లీడ్ తీసుకుంది. దాని దెబ్బకు ‘బచ్చన్ పాండే’ నిలవలేకపోయింది.

ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ వచ్చి ‘బచ్చన్ పాండే’ అడ్రస్ గల్లంతయ్యేలా చేసింది. ఈ సౌత్ సినిమా ధాటికి జాన్ అబ్రహాం నటించిన భారీ చిత్రం ‘ఎటాక్’ పరిస్థితి దారుణంగా తయారైంది. సరైన ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ 14న రిలీజ్ కాబోయే రెండు సినిమాలపై పడింది.

ఆ రోజు హిందీ ‘జెర్సీ’తో పాటు కన్నడ అనువాద చిత్రం ‘కేజీఎఫ్-2’ కూడా రిలీజవుతోంది. ఇప్పటిదాకా ట్రెండ్‌ను గమనిస్తే క్లాస్ సినిమాలకు బాలీవుడ్లో ఇప్పుడు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. సౌత్ నుంచి వచ్చే మాస్ మసాలా, యాక్షన్ సినిమాలకే పట్టం కడుతున్నారు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ‘జెర్సీ’కి ‘కేజీఎఫ్-2’ నుంచి ముప్పు తప్పదేమో అని ట్రేడ్ పండిట్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి రిలీజ్ అవుతున్న ‘జెర్సీ’ నిర్మాతలకు ఎలాంటి అనుభవం మిగులుస్తుందో చూడాలి మరి.

This post was last modified on April 6, 2022 2:45 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

3 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

5 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

5 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

5 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

9 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

9 hours ago