సమంత ప్రధాన పాత్రలో కొత్త సినిమా యశోద రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మామూలుగా అయితే ఇదంత చెప్పుకోదగ్గ విషయం కాదు. కానీ ఆగస్టు రెండో వారంలో రిలీజవుతున్న మిగతా సినిమాల సంగతి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఆగస్టు 12నే అఖిల్ అక్కినేని సినిమా ఏజెంట్ రిలీజ్ కాబోతోంది. దానికి ఒక్క రోజు ముందు నాగచైతన్య హిందీ డెబ్యూ మూవీ లాల్ సింగ్ చద్దా విడుదలవుతుంది. వీటిలో ముందు రిలీజ్ ఖరారైంది లాల్ సింగ్ చద్దా మూవీకే.
ఐతే అది బాలీవుడ్ మూవీ కాబట్టి తెలుగులో మరీ ప్రభావం ఉండకపోవచ్చు కాబట్టి అదే వీకెండ్‌కు అఖిల్ సినిమా ఏజెంట్‌ను ఫిక్స్ చేశారు. దీన్ని అన్నదమ్ముల పోటీలా చూడటానికి వీల్లేదు. కానీ సమంత సినిమాను అదే వీకెండ్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించడంలో మాత్రం ఆంతర్యం వేరుగా కనిపిస్తోంది. యశోద సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. బహుభాషల్లో తెరకెక్కిస్తున్నారు. అంటే ఇటు ఏజెంట్‌కు, అటు లాల్ సింగ్ చద్దాకు అది పోటీగా నిలవబోతోంది.
అక్కినేని హీరోలకు తన సత్తా చూపించడానికే సమంత పట్టుబట్టి ఇలా రిలీజ్ డేట్ ఎంచుకుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. చైతూ, సమంత చివరగా కలిసి నటించిన మజ్ను సినిమాలో సామ్ ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. అప్పుడు చైతూతో సమానంగా స్టార్ ఇమేజ్‌తో ఆ సినిమా పెద్ద సక్సెస్ కావడానికి సమంత కారణమైందన్న అభిప్రాయాలు వినిపించాయి.
ఐతే వివాహ బంధంలో ఉంది కాబట్టి భర్తపై భార్య డామినేషన్ అంటూ ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. కానీ ఇప్పుడు లాల్ సింగ్ చద్దా, ఏజెంట్ సినిమాలతో పోటీ పడి యశోద సత్తా చాటితో సమంత స్టార్ పవర్ గురించి అందరూ చర్చించుకుంటారు. మరి తన సత్తా చూపించడానికే సమంత ఇలా డేట్ ఎంచుకుందా లేక పబ్లిసిటీ కోసం తాత్కాలికంగా ఈ గిమ్మక్ ట్రై చేస్తున్నారా అన్నది చూడాలి.
This post was last modified on April 6, 2022 11:15 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…