బాలీవుడ్లోకి అడుగు పెట్టకముందే నేషనల్ క్రష్ అనే ట్యాగ్ తెచ్చుకున్న అమ్మాయి రష్మిక మందన్న. కన్నడలో కిరిక్ పార్టీ అనే చిన్న సినిమాతో ప్రస్థానం మొదలు పెట్టి… కొన్నేళ్లు తిరక్కుండానే సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిపోయింది ఈ కర్ణాటక భామ. తెలుగులో ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప లాంటి చిత్రాలు ఘనవిజయాలు సాధించడంతో చూస్తుండగానే ఆమె రేంజ్ మారిపోయింది.
కన్నడ నుంచి తెలుగుకి.. ఇక్కడి నుంచి తమిళానికి.. ఆపై హిందీకి.. ఇలా ఒక్కో ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి మంచి అవకాశాలు అందుకుంటూ తన రేంజ్ పెంచుకుంటోంది. ఈ ఏడాది రష్మిక ఇంకా పెద్ద రేంజికి వెళ్లబోతోందని ఆమె అందుకున్న అవకాశాలే చాటి చెబుతున్నాయి. సోమవారం రష్మిక పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె చేతిలో ఉన్న సినిమాల నుంచి, అలాగే కొత్త చిత్రాల నుంచి విషెస్‌తో పోస్టర్లు వచ్చాయి.
అవి చూస్తే రష్మిక క్రేజ్ ఏంటి బాబోయ్ ఇలా పెరిగిపోతోందని అంతా ఆశ్చర్యపోతున్నారు. విజయ్-వంశీ పైడిపల్లి కలయికలో దిల్ రాజు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్టులో రష్మిక హీరోయిన్ అని ముందు నుంచే ప్రచారం జరుగుతుండగా.. మంగళవారం ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా ధ్రువీకరించారు. మరోవైపు ఆమె రణబీర్ కపూర్ సరసన హిందీలో ఎనిమల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే మిషన్ మజ్నులో సిద్దార్థ్ మల్హోత్రాతో ఓ సినిమా, అమితాబ్ బచ్చన్‌తో మరో మూవీ చేస్తోంది. దక్షిణాదిన పుష్ప-2తో పాటు దుల్కర్ సల్మాన్ సినిమా కూడా ఆమె చేతిలో ఉంది. తమిళంలో సూర్యకు జోడీగా ఓ చిత్రంలో నటించాల్సి ఉంది. ఇలా వివిధ భాషల్లో క్రేజీ ప్రాజెక్టులతో రష్మిక ఊపు మామూలుగా లేదు. ఇప్పుడు దేశంలో పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమాలు ఇన్ని చేతిలో ఉన్న హీరోయిన్ మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రాలన్నీ రిలీజయ్యాక రష్మిక ఇంకో రేంజికి వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on April 6, 2022 8:58 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…