Movie News

‘బీస్ట్‌’పై ఆ దేశంలో నిషేధం

అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘బీస్ట్’ సినిమా. పేరుదికి తమిళ చిత్రమే అయినా.. తమిళనాడు అవతల కూడా దీనికి మంచి క్రేజే ఉంది. తెలుగులో దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు. గత కొన్నేళ్లలో విజయ్‌కి తెలుగులో ఫాలోయింగ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. నార్త్ ఇండియాలో, అలాగే విదేశాల్లో కూడా ‘బీస్ట్’ భారీగానే రిలీజ్ కాబోతోంది. ఐతే ఈ చిత్రాన్ని కువైట్ సహా కొన్ని గల్ఫ్ దేశాల్లో నిషేధించడం గమనార్హం.

సినిమాలో ఏముందో ఏమో చూడకుండా ఇలా కొన్ని దేశాలు నిషేధించడం ఏంటి, బీస్ట్ లాంటి కమర్షియల్ సినిమాలో అంత వివాదాస్పద అంశాలు ఏముంటాయి అన్న సందేహాలు కలగడం సహజం. ఐతే ట్రైలర్ చూసే ఈ సినిమాను నిషేధించేశారు. ఈ చిత్రం హైజాకింగ్ నేపథ్యంలో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఒక మాల్‌ను హైజాక్ చేస్తే.. అక్కడే ఉన్న హీరో వారి మీద ఎటాక్ చేసి అందరినీ కాపాడే క్రమంలో కథ ముందుకు సాగుతుంది.

ఐతే ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించే సినిమాలను కువైట్ సహా కొన్ని గల్ఫ్ దేశాలు ప్రోత్సహించట్లేదు. ఇలాంటి చిత్రాలు ముస్లింల పట్ల ద్వేష భావాన్ని పెంచుతాయని, అలాంటి చిత్రాలను తమ దేశాల్లో ఆడనివ్వబోమని కువైట్ లాంటి ఇస్లాం దేశాలు అంటున్నాయి. ఇంతకుముందు దుల్కర్ సల్మాన్ సినిమా కురుప్, విష్ణు విశాల్ మూవీ ఎఫ్ఐఆర్‌లను ఆ దేశాలు నిషేధించాయి. ఇప్పుడు అదే కోవలో ‘బీస్ట్’ మీదా బ్యాన్ విధించాయి. ఈ దేశాల్లో సౌత్ సినిమాలకు మంచి ఆదరణే దక్కుతుంటుంది.

అక్కడ దక్షిణాది వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కాబట్టి ఇలా నిషేధం విధించడం వల్ల ఆదాయానికి గండి పడుతుంది. ఐతే ఇలాంటి కొన్ని దేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతాయని కథల విషయంలో రచయితలు, దర్శకులు రాజీ పడలేరు. ‘బీస్ట్’ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించగా.. సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

This post was last modified on April 5, 2022 7:19 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

2 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

4 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

4 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

4 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

8 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

8 hours ago