నందమూరి నటసింహం బాలకృష్ణకు, మాస్ రాజా రవితేజకు ఎప్పుడో ఏదో గొడవ జరిగిందని, వాళ్లిద్దరికీ అస్సలు పడదని చాలా ఏళ్ల పాటు ఒక ప్రచారం నడుస్తూ వచ్చింది. ఇద్దరూ ఎక్కడా ఎప్పుడూ సన్నిహితంగా కనిపించకపోవడంతో ఈ ప్రచారం నిజమే అనుకున్నారు చాలామంది. ఐతే కొన్ని నెలల కిందట బాలయ్య హోస్ట్ చేసే ‘అన్ స్టాపబుల్’ షోకు రవితేజ అతిథిగా హాజరు కావడం.. ఇద్దరూ చాలా సరదగా వ్యవహరించడం.. తమ మధ్య అభిప్రాయ భేదాల గురించి తేలిగ్గా తీసిపడేయడంతో ఈ ప్రచారానికి తెరపడింది.
ఈ ఎపిసోడ్లో బాలయ్య, రవితేజల కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. వీళ్లిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. త్వరలోనే ఈ కాంబినేషన్ తెరమీదికి వస్తే ఆశ్చర్యమేమీ లేదన్నది ఇండస్ట్రీ జనాల మాట. బాలయ్య, రవితేజ కలయికలో సినిమా చేయడానికి అనిల్ రావిపూడి ప్రయత్నిస్తున్నట్లు కొంచెం గట్టిగానే సమాచారం వినిపిస్తోంది. అనిల్ రావిపూడికి బాలయ్య అంటే విపరీతమైన అభిమానం. మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి భారీ చిత్రం తీసినా సరే.. బాలయ్యతో సినిమా చేయడం అతడి కలగా ఉంది. గతంలో బాలయ్యతో ‘రామారావు’ అనే సినిమా చేయడానికి ప్రయత్నించినా.. ఎందుకో అది వర్కవుట్ కాలేదు. అలాగని ఆశలు వదులుకోలేదు.
బాలయ్యను వదిలిపెట్టలేదు. వీరి కలయికలో త్వరలోనే సినిమా వస్తుందన్న ప్రచారం జరిగింది. అనిల్‌కు బాలయ్య కమిట్మెంట్ ఇచ్చిన మాట మాత్రం వాస్తవం. కానీ ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో క్లారిటీ లేదు. ఐతే బాలయ్య కోసం అనిల్ కథ రెడీ చేసే ప్రయత్నంలో ఉన్నాడని, ఇందులో రవితేజ కూడా నటిస్తాడని.. ఈ మల్టీస్టారర్‌కు ఇద్దరి నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రవితేజతో ఇప్పటికే అనిల్ ‘రాజా ది గ్రేట్’ లాంటి హిట్ సినిమా తీశాడు. కాబట్టి అతడితో ఇంకో సినిమా చేయడానికి రవితేజకు అభ్యంతరం లేకపోవచ్చు. ఇప్పటికే చిరంజీవితో బాబీ సినిమాలో ఓ అతిథి పాత్ర చేస్తున్న రవితేజ దాని తర్వాత బాలయ్యతోనూ జట్టు కట్టాడంటే ఈ సినిమాకు వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది.
This post was last modified on April 5, 2022 8:16 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…