దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా ఎన్నో విజయాలు చూశారు. కానీ ఇప్పుడు ఆయన ఓ సినిమాతో తన కెరీర్లోనే ఎన్నడూ లేని స్థాయిలో లాభాలు అందుకుంటున్నాడు. ఆ చిత్రం ఆర్ఆర్ఆర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో బాహుబలి-2 నైజాం హక్కుల కోసం దిల్ రాజు 50 కోట్ల దాకా పెట్టుబడి పెడితే పెద్ద రిస్క్ అన్నారు.
కానీ ఆ చిత్రం భారీగానే లాభాలు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మీద ఇదే ఏరియాకు ఏకంగా రూ.75 కోట్లకు పెట్టేశారాయన. ఇది కూడా రిస్క్ అనే అన్నారు. కానీ ఆయన నమ్మకం ఫలించింది. నైజాంలో ఈ చిత్రం ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఈ ఏరియాలో ఆ చిత్ర షేర్ రూ.100 కోట్లకు చేరువగా ఉంది.
ఇంకో పది కోట్ల షేర్ గ్యారెంటీ అంటున్నారు. అంటే మొత్తం రూ.35 కోట్ల దాకా లాభం అన్నమాట. పర్సంటేజ్ పరంగా పెట్టుబడి మీద ఎక్కువ లాభాలు వచ్చి ఉండొచ్చు కానీ.. ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ఏరియాకు రూ.35 కోట్ల లాభం అందుకోవడం మాత్రం ఇదే ప్రథమం అయి ఉండొచ్చు. అందుకే ఈ ఆనందంలో దిల్ రాజు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు ఆర్ఆర్ఆర్ టీం కోసం. ఒక నిర్మాత తన సినిమా విజయోత్సవ వేడుక చేసిన స్థాయిలో ఆయన ఈ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు హైదరాబాద్‌లో.
ఆర్ఆర్ఆర్ టీం నుంచి ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో ఈ వేడుకలో పాల్గొన్నారు. హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ సతీమణులతో ఈ వేడుకకు హాజరయ్యారు. దర్శకుడు రాజమౌళి కుటుంబం నుంచి చాలామందే ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీ తాలూకు ఫొటోలు చూస్తే రాజు చాలా గ్రాండ్‌గానే ఈ పార్టీ ఏర్పాటు చేశాడని అర్థమవుతోంది. మరి రూ.35 కోట్ల లాభం వస్తుంటే ఈ మాత్రం గ్రాండ్‌నెస్ చూపించకపోతే ఎలా?
This post was last modified on April 5, 2022 9:49 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…