ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక టికెట్ల రేట్లు ఉన్నది తెలంగాణలోనే. సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్సుల్లో మినిమం రూ.200 నుంచి రేటు మొదలవుతోంది. ఐతే ఈ రేట్లకే ఎక్కువ అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. అలాంటిది కాస్త క్రేజున్న సినిమా రిలీజైతే రేట్లు ఇంకా పెంచేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకైతే సింగిల్ స్క్రీన్లలో ఆన్ లైన్ టికెట్ రేటు రూ.260 (ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపి) నుంచి మొదలైంది. మల్టీప్లెక్సుల్లో రేటు గరిష్టంగా 500 దాకా వెళ్లిపోయింది.
300-400కి కొన్ని ఓటీటీలు ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఇస్తుంటే.. ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా థియేటర్లకు వస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే రిపీట్ ఆడియన్స్ కూడా తగ్గిపోతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్థాయి వేరు. దానికున్న క్రేజ్ దృష్ట్యా అంతేసి రేట్లు పెట్టినా జనం బాగానే థియేటర్లకు వెళ్లి సినిమా చూశారు.
కానీ దాంతో వేరే సినిమాలు పోల్చుకుని ఆశపడితే మొదటికే మోసం రావచ్చు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు సాధారణ రేట్లతో కూడా ఆడటం కష్టంగా ఉంది. గత వీకెండ్లో రిలీజైన ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రానికి కనీస స్థాయిలో కూడా ఆదరణ దక్కలేదు. ఇక ఈ వారం రిలీజవుతున్న ‘గని’ సినిమాకు ఓమాదిరిగా క్రేజ్ ఉంది. దీనికి సాధారణ రేట్లు పెడితే వర్కవుట్ కావచ్చు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ ఇరగాడేస్తుండటం చూసి దీని మేకర్స్‌కు ఆశ పుట్టినట్లుంది. అందుకే టికెట్ల రేట్లు పెంచుకున్నారు. సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు రూ.175 నుంచి మొదలవుతుండగా.. మల్టీప్లెక్సుల్లో రూ.295గా రేట్ ఫిక్స్ చేశారు.
ఆన్ లైన్లో టికెట్ బుక్ చేస్తే రూ.200, 330 దాకా ఉంటోంది రేటు. మరి ఇంత రేటు పెట్టి ఇలాంటి మీడియం రేంజ్ సినిమా చూడటానికి సగటు సినీ ప్రేక్షకులు ఏమేర ఆసక్తి చూపిస్తారన్నది ప్రశ్నార్థకం. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇంత రేటు పెట్టి ఈ సినిమా చూడటం సందేహమే. ఒక రకంగా చెప్పాలంటే ఈ రేట్లు పెట్టడం అంటే కొరివితో తల గోక్కోవడమే. ‘ఆర్ఆర్ఆర్’కు అసాధారణంగా రేట్లు పెంచినపుడే ఈ పరిణామం టాలీవుడ్‌కు చేటు చేస్తుందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ సందేహాలే నిజమయ్యేట్లున్నాయి.
This post was last modified on April 4, 2022 1:02 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…