‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మీద అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలు తలకిందులయ్యాయి. సాహో, రాధేశ్యామ్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అయ్యాయి. ‘సాహో’ అయినా యాక్షన్ మూవీ కాబట్టి మంచి హైప్ వచ్చింది. ఓపెనింగ్స్ కుమ్మేసింది. కానీ ‘రాధేశ్యామ్’కు అదీ లేకపోయింది. తెలుగు రాష్ట్రాల వరకే ఆ చిత్రం ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది. మిగతా ప్రాంతాలన్నింట్లో సినిమాకు ఓపెనింగ్స్ కూడా సరిగా లేవు.
ఓవరాల్‌గా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సాహో, రాధేశ్యామ్ రెండు చిత్రాల్లోనూ ప్రభాస్ అభిమానుల అంచనాలకు తగ్గట్లు కనిపించలేదు. ముఖ్యంగా అతడి లుక్స్ తేడా కొట్టాయి. ‘బాహుబలి’లో అంత అందంగా కనిపించిన అతను.. ఈ సినిమాలకు వచ్చేసరికి ఎందుకిలా తయారయ్యాడు.. అంత కష్టపడ్డాక రిలాక్స్ అయిపోయాడా.. లుక్స్ మీద కనీసం కేర్ తీసుకోలేకపోయాడా అన్న ప్రశ్నలు తలెత్తాయి.
ఐతే ప్రభాస్ నుంచి రాబోతున్న తర్వాతి సినిమా ‘ఆదిపురుష్’లో మాత్రం అతడి లుక్స్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదని తెలుస్తోంది. ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకు బెస్ట్ షేప్‌లోకి రావడానికి ప్రభాస్ పడ్డ కష్టం గురించి మాట్లాడాడు. రాముడి పాత్రలో పర్ఫెక్ట్ అనిపించడం కోసం ఒక ఆర్చర్ తరహాలో ‘వి’ షేప్‌లోకి రావడానికి ప్రభాస్ కష్టపడ్డాడని.. సన్నని నడుము, వెడల్పాటి భుజాలు తయారు కావడానికి జిమ్‌లో విపరీతంగా కష్టపడ్డాడని.. ఈ సినిమాలో ప్రభాస్ బెస్ట్ ఫిజిక్, షేప్‌తో కనిపిస్తాడని ఓం రౌత్ అన్నాడు.
ప్రభాస్ కళ్లు కూడా ఇందులో చాలా షార్ప్‌గా కనిపిస్తాయని, పాత్ర తాలూకు ఇంటెన్సిటీని అవి చూపిస్తాయని.. ఇక ‘ఆదిపురుష్’ హిందీ డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండేలా ప్రభాస్ చాలా రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడని.. ఇలా ప్రతి విషయంలోనూ పభాస్ నుంచి ఈ చిత్రంలో పర్ఫెక్షన్ చూడొచ్చని ధీమా వ్యక్తం చేశాడు ఓం రౌత్. ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 4, 2022 8:03 am
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…