టైగర్ నాగేశ్వరరావు.. మాస్ రాజా రవితేజ ప్రధాన పాత్రలో మొదలైన కొత్త చిత్రం. ఇంతకుముందు దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చత్రాలను రూపొందించిన వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో బహు భాషా చిత్రంగా ఇది తెరకెక్కబోతోంది. ఉగాది రోజు హైదరాబాద్‌లో శనివారం అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవితో పాటు కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. టైగర్ నాగేశ్వరరావు కథ ముందు తన దగ్గరికే వచ్చిందని ఆయన చెప్పారు. దర్శకుడు వంశీ తనతో ఈ సినిమా చేయాలనుకుని కరోనా టైంలో కథ వినిపించాడని, చాలా చక్కగా కథ చెప్పాడని, స్టోరీ కూడా తనకు నచ్చిందని, కానీ ఈ సినిమా చేయడం తనకు సాధ్యపడలేదని చిరు వెల్లడించారు.
ఇప్పుడు తన తమ్ముడు రవితేజ ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని చిరు అన్నారు. టైగర్ నాగేశ్వరరావు గురించి తన చిన్నతనంలోనే విన్నానని.. తన తండ్రి చీరాలలో పోలీస్ ఉద్యోగం చేస్తున్నపుడు.. పక్కనే ఉన్న స్టూవర్టుపురంలో అక్కడి జనాలు టైగర్ నాగేశ్వరరావును హీరోగా కొనియాడుతుండేవారని అన్నారు.
ఇక అతడి గురించి దర్శకుడు వంశీ పూర్తిగా తెలుసుకుని, కమర్షియల్‌గా తీర్చిదిద్దుతున్నాడని.. కశ్మీర్ ఫైల్స్‌తో మంచి సక్సెస్ సాధించిన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను పెద్ద ఎత్తున నిర్మించడానికి పూనుకోవడం శుభ పరిణామమని.. కచ్చితంగా ఈ సినిమా విజయవంతం అవుతుందని చిరు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశమున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రవితేజకు జోడీగా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు.
This post was last modified on April 3, 2022 12:05 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…