Movie News

వ‌రుణ్ పుట్టిన‌పుడే అంద‌గాడు: బ‌న్నీ

త‌న క‌జిన్ వ‌రుణ్ తేజ్ అంటే త‌నకు చిన్న‌త‌నం నుంచే చాలా ఇష్ట‌మ‌ని అల్లు అర్జున్ అన్నాడు. వ‌రుణ్ కొత్త సినిమా గ‌ని ప్రి రిలీజ్ ఈవెంట్లో బ‌న్నీ మాట్లాడుతూ.. వ‌రుణ్ ఇప్పుడు అంద‌రికీ అంద‌గాడిగా క‌నిపిస్తుండొచ్చ‌ని, కానీ పుట్టిన‌పుడే అత‌ను చాలా క్యూట్‌గా ఉండేవాడ‌ని, అప్ప‌ట్నుంచే అత‌ను అంద‌గాడ‌ని బ‌న్నీ చెప్పాడు.

సినిమాల్లోకి రాక‌ముందు వ‌ర‌కు వ‌రుణ్ అంటే త‌న‌కు ఇష్టం మాత్ర‌మే ఉండేద‌ని.. కానీ అత‌ను సినిమాల్లోకి వ‌చ్చాక త‌న‌పై గౌర‌వం వ‌చ్చింద‌ని.. అందుకు కార‌ణం త‌ను ఎంచుకున్న సినిమాల‌ని, ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్ర‌యాణం చేశాడ‌ని, అత‌డి జ‌ర్నీని చూసి తామంద‌రం గ‌ర్వ‌ప‌డుతున్నామ‌ని బ‌న్నీ అన్నాడు. గ‌ని సినిమా కోసం వ‌రుణ్ మామూలు క‌ష్టం ప‌డ‌లేద‌ని.. క‌రోనా కార‌ణంగా సినిమాఆల‌స్య‌మైనా.. సిక్స్ ప్యాక్ కొన‌సాగిస్తూ, బాక్సింగ్ చేస్తూ ఇంత కాలం క‌ష్ట‌ప‌డ‌టం మామూలు విష‌యం కాద‌ని బ‌న్నీ అన్నాడు.

తాను గ‌ని సినిమా చూశాన‌ని.. త‌న‌కు బాగా న‌చ్చింద‌ని.. రేప్పొద్దున ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమాను మెచ్చుతార‌ని బ‌న్నీ ధీమా వ్య‌క్తం చేశాడు. నిర్మాత అయిన త‌న తండ్రి వార‌స‌త్వాన్ని త‌మ్ముడు శిరీష్ కొన‌సాగిస్తాడ‌ని అనుకున్నాన‌ని, కానీ అత‌ను న‌ట‌న‌లోకి వ‌చ్చాడ‌ని, అది త‌న‌కు ఇష్ట‌మైన విష‌యమే అయినా.. తండ్రి వార‌సత్వాన్ని ఎవ‌రు కొన‌సాగిస్తారు అనుకుంటే.. త‌న అన్న‌య్య బాబీ నిర్మాత‌గా మార‌డం త‌న‌కెంతో సంతోషంగా ఉంద‌ని చెప్పాడు బ‌న్నీ. నిర్మాణ వ్య‌వ‌హారాల్లో బాబీకి 20 ఏళ్ల అనుభ‌వం ఉంద‌ని.. త‌న సినిమాల క‌థ‌ల ఎంపిక‌లో కూడా కీల‌కంగా ఉన్నాడ‌ని, అలాంటి వ్య‌క్తి ఈ సినిమాతో నిర్మాత అవుతున్నాడంటే అది చాలా స్పెష‌ల్‌గానే ఉంటుంద‌ని బ‌న్నీ చెప్పాడు.

ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి త‌న‌పై అంద‌రూ పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టే సినిమా తీశాడ‌ని.. ఈ మ‌ధ్య సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతోంద‌ని, ఈ చిత్రం కూడా హిట్ట‌యి అత‌డి విన్నింగ్ స్ట్రీక్‌ను కొన‌సాగిస్తుంద‌ని చెప్పాడు బ‌న్నీ. చివ‌ర‌గా త‌న అభిమానుల గురించి మాట్లాడుతూ.. మామూలుగా ఫ్యాన్స్‌కు హీరోనే బ‌లం అని, కానీ అభిమానులే త‌న‌కు బ‌లం అని, వాళ్లు చేసే మంచి ప‌నులు చూసి తాను ఇన్‌స్పైర్ అయి త‌న ఎన‌ర్జీ అంతా ఒక మంచి విష‌యానికి ఉప‌యోగించాల‌ని చూస్తున్నాన‌ని బ‌న్నీ చెప్పాడు.

This post was last modified on April 3, 2022 10:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago