ఒక సినిమా ఒకే థియేటర్లో కోటి రూపాయల కలెక్షన్ రాబడితే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్లం కొన్నేళ్ల ముందు వరకు. ఐతే పెద్ద సినిమాలు రిలీజై, పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సింగిల్ థియేటర్లో కోటి రూపాయల గ్రాస్ అన్నది మామూలు విషయం అయిపోయింది ఈ మధ్య. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి థియేటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంటున్నాయి.
హైదరాబాద్ వరకు తీసుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మెయిన్ థియేటర్, అలాగే ఏఎంబీ సినిమాస్ లాంటి చోట్ల కోటి రూపాయల గ్రాస్ కేక్ వాక్ అయిపోయింది. ఐతే ఒక థియేటర్లో ఒక సినిమా రూ.2 కోట్ల వసూళ్లు రాబట్టే రోజులు కూడా వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఘనత దిశగా దూసుకెళ్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ సినిమా మెయిన్ థియేటర్ అయిన సుదర్శన్ 35 ఎంఎంలో రూ.2 కోట్ల గ్రాస్‌కు చేరువగా ఉందీ చిత్రం. మొత్తంగా క్రాస్ రోడ్స్‌లో ఈ సినిమా రూ.4 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉండటం విశేషం.
ఫుల్ రన్లో ఈ ఒక్క ఏరియా నుంచి రూ.5 కోట్లకు గ్రాస్ కలెక్ట్ చేయడం లాంఛనంగానే కనిపిస్తోంది. ఇది ఆల్ టైం రికార్డని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా ఒక సిటీలోని ఒక చిన్న ఏరియాలో 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అన్నది అసామాన్యమైన విషయం. రెండో వారంలోనూ క్రాస్ రోడ్స్‌లో నాలుగు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ ఆడుతోంది.
తొలి వీకెండ్లో ఇంకా ఎక్కువ థియేటర్లలో సినిమాను నడిపించారు. అన్ని థియేటర్లూ హౌస్ ఫుల్స్‌తో నడిచాయి. రెండో వీకెండ్లోనూ ఇక్కడ ఆర్ఆర్ఆర్ ఆడుతున్న అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్స్ ఖాయంగా కనిపిస్తోంది. వీక్ డేస్‌లో కొంత తగ్గిన ఆక్యుపెన్సీ వీకెండ్‌కు వచ్చేసరికి పుంజుకున్నట్లే కనిపిస్తోంది. కొత్త సినిమాల ప్రభావం ఆర్ఆర్ఆర్ మీద ఏమాత్రం కనిపించట్లేదు.
This post was last modified on April 2, 2022 1:46 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…