జనగణమన.. టాలీవుడ్లో దాదాపు పదేళ్ల నుంచి చర్చల్లో ఉందీ పేరు. మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ ఈ సినిమా చేయాలనుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దీనికి ఎప్పుడో ఎప్పుడో స్క్రిప్టు రెడీ చేసిన పూరి.. ఇందులోని కొన్ని డైలాగ్స్‌ను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ‘బిజినెస్ మేన్’ తర్వాత పూరి-మహేష్ కలిసి ఈ సినిమా చేస్తారని ప్రచారం జరిగింది కానీ ఎందుకో అది సాధ్యపడలేదు.
బహుశా పూరి ఫామ్ దెబ్బ తినడమే అందుకు కారణం కావచ్చు. పూరి కూడా ఈ సినిమాను లైట్ తీసుకోవడం చూస్తే.. మహేష్ తప్ప ఇంకెవరితోనూ దీన్ని చేసే ఆలోచన ఆయనకు లేదనిపించింది. ఐతే ఇప్పుడు విజయ్ దేవరకొండతో తన కలల ప్రాజెక్టును తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశాడు పూరి. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. కానీ ఈ సినిమాకు పోస్టర్ మీద వేసిన పేరు వేరు. జేజీఎం.. అని జనగణమనను ఇంగ్లిష్ అక్షరాల్లో కుదించి టైటిల్‌గా పెట్టేశారు.
మరి ఇన్నేళ్లూ ‘జనగణమన’ అనే టైటిలే ప్రచారంలో ఉండగా.. ఇప్పుడు ఇలా వేరే పేరు ఎందుకు పెట్టారు అనిపించొచ్చు. కానీ ఇదే పేరుతో వేరే భాషల్లో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అవి ముందే మొదలై చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్నాయి. ముఖ్యంగా మలయాళంలో పృథ్వీరాజ్ లాంటి స్టార్ హీరో ఈ టైటిల్‌తో సినిమా చేశాడు. దాని ట్రైలర్ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. త్వరలో ఆ చిత్రం విడుదల కానుంది. కొన్నేళ్ల గ్యాప్ ఉన్నా ఓకే కానీ.. ఇప్పుడు ‘జనగణమన’ టైటిల్‌తో ఒక పేరున్న సినిమా రిలీజవుతుంటే.. ఏడాది లోపు అదే పేరుతో ఒక పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయడానికి ఇబ్బందిగానే ఉంటుంది.
అలాగని ఇప్పటికే తమ సినిమా విషయంలో జనాలు ఫిక్స్ అయి ఉన్న పేరును మార్చలేరు. అందుకే జనగణమనను షార్ట్ చేసి ‘జేజీఎం’ అని టైటిల్ పెట్టేశారు. ఐతే పేరుకే ‘జేజీఎం’ కానీ.. అందరూ ఈ సినిమాను ‘జనగణమన’గానే చెప్పుకుంటారు. ఆ రకంగా టైటిల్ క్లాష్ ఉండదు. అలాగని ఆ పేరునూ వదులుకున్నట్లు ఉండదు. మొత్తానికి టైటిల్ విషయంలో పూరి తెలివిగానే వ్యవహరించాడని చెప్పాలి.
This post was last modified on March 31, 2022 6:55 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…