Movie News

అరుదైన క్లబ్‌లో RRR

రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే ఓ తెలుగు సినిమా అమెరికాలో రిలీజవడమే గగనంగా ఉండేది. అలాంటిది ఐదేళ్ల కిందట వచ్చిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఏకంగా అక్కడ 20 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. బాహుబలి-2 వివిధ భాషల్లో కలిపి ఆ మార్కును అందుకున్నప్పటికీ బేసిగ్గా అది తెలుగు సినిమా కావడం మనకు గర్వకారణం. అంతకముందు, ఆ తర్వాత మరే సినిమా కూడా 20 మిలియన్ల మార్కును అందుకోలేదు.

‘బాహుబలి’ ఫీట్‌ను రిపీట్ చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఏ సినిమా మీదా అలాంటి అంచనాలు కూడా కలగట్లేదు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’కు యుఎస్‌లో మరీ హైప్ ఏమీ లేకపోవడంతో పది మిలియన్ల క్లబ్బులో చేరుతుందా అన్న సందేహాలు కూడా కలిగాయి. ఐతే ఈ చిత్రం ఆ ఘనతను అందుకుంది. యుఎస్‌లో 10 మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరిన అరుదైన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

సోమవారం నాటికే 9.9 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’..  మంగళవారానికి జరిగిన ప్రి సేల్స్‌తోనే 10 మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టేసింది. మంగళవారం ఆఫర్ల కారణంగా సోమవారం కంటే తర్వాతి రోజు యుఎస్ వసూళ్లు ఎక్కువ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం యుఎస్‌లో బ్రేక్ ఈవెన్‌కు చేరువగా ఉంది. రాబోయే వీకెండ్లో పోటీ లేని నేపథ్యంలో ఇంకా వసూళ్లు పెరగడం ఖాయం. ఫుల్ రన్లో ఈ చిత్రం దాదాపు 13 మిలియన్ల మధ్య కలెక్ట్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

యుఎస్‌లో 10 మిలియన్ల మార్కును అందుకున్న ఐదో ఇండియన్ సినిమా ఇది. బాహుబలి-2 అక్కడ 20.5 మిలియన్ డాలర్లు రాబడితే.. హిందీ చిత్రాలు దంగల్ 12.39 మిలియన్లు, పద్మావత్ 12.16 మిలియన్లు, పీకే 10.6 మిలియన్లు వసూలు చేశాయి. ఇప్పుడు ఈ క్లబ్బులోకి ‘ఆర్ఆర్ఆర్’ కూడా చేరింది. మరి మూడు హిందీ చిత్రాలను దాటి బాహుబలి తర్వాత, రెండో స్థానానికి ‘ఆర్ఆర్ఆర్’ చేరుతుందేమో చూడాలి.

This post was last modified on March 30, 2022 2:19 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

2 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

4 hours ago