ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కలల కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ బాబు జట్టు కట్టబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ కథ ముగియడంతో త్వరలోనే జక్కన్న.. మహేష్ సినిమా పనిలో నిమగ్నం కాబోతున్నాడు. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి అటు ఇటుగా ఇంకో ఏడాది సమయమైనా పట్టొచ్చు. ఈలోపు సర్కారు వారి పాటతో పాటు త్రివిక్రమ్ సినిమాను కూడా మహేష్ పూర్తి చేయనున్నాడు.
ఐతే రాజమౌళి సినిమా అంటే మిగతా చిత్రాల తరహాలో పని చేస్తే కుదరదు. అసలు ప్రిపరేషనే చాలా గట్టిగా ఉంటుంది. అవతారం మార్చుకోవాలి. ఫిజిక్ పెంచాలి. పాత్ర కోసం వర్క్ షాపుల్లో పాల్గొనాలి. ఇంకా చాలా తతంగం ఉంటుంది. శారీరకంగా, మానసికంగా చాలా కష్టమే ఉంటుంది. బాహుబలి కోసం ప్రభాస్.. ఆర్ఆర్ఆర్ కోసం తారక్, చరణ్ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే.
ఆ కష్టం గురించి ఇంటర్వ్యూల్లో చెబుతుంటే వినేవాళ్లకు వామ్మో అనిపించింది. తాను కోరుకునే ఔట్ పుట్ రావాలంటే అంత కష్టపడక తప్పదన్నది జక్కన్న అభిప్రాయం. షూటింగ్‌కు ముందు ప్రిపరేషన్, కెరీర్లోనే అత్యధిక వర్కింగ్ డేస్, ఇబ్బందికర వాతావరణ పరిస్థితుల్లో ఔట్ డోర్ షూటింగ్స్.. ఇవన్నీ జక్కన్న సినిమాలకు కామన్. మరే సినిమాకూ లేనన్ని టేక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏ కంప్లైంట్స్ లేకుండా తనకు సరెండర్ అయ్యేవారితోనే జక్కన్న సినిమాలు చేస్తాడు.
లొంగని వాళ్లను కూడా లొంగదీసుకుంటాడు. ఐతే మిగతా హీరోల మాదిరి మహేష్ ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఒక్క 1 నేనొక్కడినేకు మినహాయిస్తే మహేష్ శారీరకంగా బాగా కష్టపడ్డ సినిమాలు గత దశాబ్ద కాలంలో కనిపించవు. సుకుమార్‌తో రెండో సినిమా చేయాల్సి వచ్చినపుడు మేకోవర్ కోసం, అలాగే షూటింగ్ పరంగా చాలా కష్టం ఉండటం కూడా ఆ చిత్రాన్ని వదులుకోవడానికి ఓ కారణమన్న టాక్ నడిచింది. వేరే దర్శకులు మహేష్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా, కాస్త సుకుమారంగానే చూసుకుంటారని అంటుంటారు ఇండస్ట్రీ జనాలు. ఈ నేపథ్యంలో ప్రభాస్, తారక్, చరణ్‌ల మాదిరి ఒళ్లు హూనం చేసుకుని రాజమౌళి సినిమాకు మహేష్ కష్టపడతాడా.. అతణ్ని జక్కన్న అంత కష్టపెట్టిస్తాడా అన్నది చూడాలి మరి.
This post was last modified on March 29, 2022 1:22 pm
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…