ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో హైప్ కోరుకున్న దాని కంటే ఎక్కువే వచ్చింది. అసలే రాజమౌళి సినిమా.. పైగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్ల క్రేజీ కాంబినేషన్లో సినిమా అంటే హైప్ రాకుండా ఎలా ఉంటుంది. కానీ తారక్, చరణ్ తెలుగు రాష్ట్రాల అవతల.. ముఖ్యంగా నార్త్ ఇండియాలో మరీ ఫేమస్ ఏమీ కాదు.
మరోవైపేమో బాహుబలితో పోలిస్తే ఆర్ఆర్ఆర్ అంతగా ఉత్తరాది ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అన్నింటికీ మించి అక్కడ రెండు వారాల నుంచి కశ్మీర్ ఫైల్స్ ప్రభంజనం సాగిస్తుండటంతో ఆర్ఆర్ఆర్‌ను అంతా లైట్ తీసుకున్నట్లే కనిపించారు. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ డల్లుగా కనిపించాయి. తొలి రోజు హౌస్ ఫుల్స్ సంగతి అలా ఉంటే.. సగమైనా థియేటర్లు నిండుతాయా అని సందేహాలు కలిగాయి. చాలామంది ట్రేడ్ పండిట్లు ఆర్ఆర్ఆర్‌తో రాజమౌళి మ్యాజిక్ రిపీట్ చేయలేకపోతున్నాడని, కనీసం ప్రభాస్ మూవీ సాహో స్థాయిలో కూడా హైప్ లేదని తేలిక చేసి మాట్లాడారు ఆర్ఆర్ఆర్ గురించి.
కానీ తొలి రోజే ఈ వ్యాఖ్యానాలకు సమాధానం వచ్చేసింది ఆర్ఆర్ఆర్ నుంచి. రిలీజ్ రోజు మధ్యాహ్నం నుంచే అక్కడ కలెక్షన్లు పుంజుకున్నాయి. ట్రేడ్ పండిట్ల అంచనాలకు కాస్త మించే రూ.19 కోట్ల దాకా తొలి రోజు గ్రాస్ వసూళ్లు రాబట్టిందా సినిమా. ఇక ఈ సినిమా సత్తా ఏంటన్నది రెండో రోజు నుంచి అందరికీ తెలిసొచ్చింది. ఉత్తరాదిన మాస్ ఏరియాల్లో ఆర్ఆర్ఆర్ శని, ఆదివారాల్లో వసూళ్ల మోత మోగించింది. తొలి రోజును మించి రెండో రోజు, రెండో రోజును మించి మూడో రోజు హిందీ వెర్షన్ వసూళ్లు రాబట్టడం విశేషం.
శనివారం వసూళ్లు రూ.24 కోట్లు కాగా.. ఆదివారం కలెక్షన్లు ఇంకా పెరిగి రూ.31.5 కోట్లకు చేరుకున్నాయి. తొలి రోజు కన్నా రెండో రోజు వసూళ్లు 60 శాతం ఎక్కువ ఉండటం ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో జనాల్లోకి వెళ్లిపోయిందో చెప్పడానికి నిదర్శనం. గత రెండేళ్ల వ్యవధిలో హిందీలో ఓ సినిమా సాధించిన అత్యధిక ఒక రోజు వసూళ్ల రికార్డును ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకోవడం విశేషం. సూర్యవంశీ 27 కోట్లతో సాధించిన రికార్డును ఆర్ఆర్ఆర్ బద్దలు కొట్టేసింది.
This post was last modified on March 29, 2022 6:56 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…