పొద్దున్నే మొదటి ఆట పడగానే కాస్త మిక్సడ్ టాక్ రావడం.. మధ్యాహ్నం నుండి బాగుంది అనిపించుకోవడం.. రాత్రి ఆఖరి ఆట అయ్యేసరికి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ టాక్ తెచ్చుకోవడం రాజమౌళి సినిమాలకు కొత్తేం కాదు. ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా అదే జరిగింది.
శనివారం ఉదయం లేచి చూసేసరికి నార్త్ ఇండియా సినిమా బ్లాక్ బస్టర్ అంటూ టాక్ వచ్చేసింది. దానితో శనివారం, ఆదివారం అక్కడ ధియేటర్లకు భారీగా జనాలు తరలివచ్చే ఛాన్సుంది. ఇదంతా చూస్తే ఒక్కటి మాత్రం అర్ధమవుతోంది.
మొదటిరోజును ఇండియా, ఓవర్సీస్ మొత్తంగా కలుపుకుని ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు రూ. 225 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఎలాగో ఓవర్సీస్ మరియు తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో కూడా ధియేటర్లన్నీ హౌస్ ఫుల్స్ అయిపోయే ఛాన్సుంది. ఒక నార్త్ లో టాక్ బాగొచ్చింది కాబట్టి, అక్కడ కూడా పెద్ద పెద్ద నగరాల్లో మల్టీప్లెక్సులన్నీ ఈ వీకెండ్ హౌస్ ఫుల్ బోర్టు పెట్టేసే ఛాన్సుంది.
ఆ లెక్కన చూస్తూ తొలి వీకెండ్లో ఆర్ఆర్ఆర్ 500 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే కేవలం మూడు రోజులు సినిమా ఆడితేనే రూ. 250 కోట్ల షేర్ వసూల్ చేస్తున్నట్లు. ఆ లెక్కన ఇంకో వారం సినిమా ఆడిందంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడంతా అనాపైసల్ తో సహా తిరిగొచ్చేస్తుంది.
ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాలో కథ లేదు కాని విజువల్స్ అదిరిపోయాయ్ అనే టాక్ కూడా బాగా పాపులర్ అవుతోంది. అయితే జనాలు వెండితెర మీద సినిమాను చూడ్డానికి వస్తున్నారంటే ఎక్కువ శాతం కేవలం విజువల్స్ చూసి ఎంజాయ్ చెయ్యడానికే.
కథ కావాలంటో ఇంట్లో కూర్చొని ఫోన్లో నెట్ ఫ్లిక్స్ చూసుకుంటే సరిపోతుందిగా అనే థాట్ లో ఉన్నారు చాలామంది ఆడియన్స్. వాళ్లందరూ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చూడ్డానికి ధియేటర్లకు వస్తే 500 కోట్లేంటి.. త్వరలోనే 1000 కోట్లు గ్రాస్ కొట్టేసినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు.
This post was last modified on March 27, 2022 12:05 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…