ఫైనల్ గా యువ హీరో ఆది పినిశెట్టి తనకు నచ్చిన హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. గత కొంతకాలంగా ఈ హీరో ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు గా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే వార్తలు ఎన్ని వస్తున్నా కూడా ఎప్పుడూ కూడా ఈ ఇద్దరూ ఆ విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. కానీ నిత్యం వారి కుటుంబానికి సంబంధించిన ఈవెంట్స్ లో పాల్గొంటూనే ఉన్నారు.
మొత్తానికి విరి ప్రేమ నిజమేనని అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. ఆది పినిశెట్టి – హీరోయిన్ నిక్కీ గల్రానినీ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈనెల 24వ తేదీన వీరి కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిశ్చితార్థం కూడా జరిగినట్లు కొద్దిసేపటి క్రితం ఆది పినిశెట్టి అఫీషియల్ గా ఫొటో కూడా షేర్ చేసి ప్రకటన ఇచ్చాడు. తాము ఎప్పుడో జంటగా ఒకటయ్యామని ఇప్పుడు అఫీషియల్ అని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ జంట ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదివరకే ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ తో రెండు సినిమాలు చేశాడు. తెలుగులో మలుపు అనే సినిమా తో పాటు బైలాంగ్యువల్ మూవీ మరకతమణి సినిమాలో కూడా ఇద్దరు కలిసి నటించారు. ఇక చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫ్యామిలీ ఈవెంట్స్ లో కూడా తరచు కనిపించేవారు. అసలైతే గత ఏడాదిలోనే వివాహం జరుగుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో టాక్ గట్టిగానే వచ్చింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న ట్లు క్లారిటీ వచ్చేసింది.
ఇక ఆది పినిశెట్టి హీరోగానే కాకుండా అప్పుడప్పుడు విభిన్నమైన సహాయక పాత్రలతో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా విలన్ గా కూడా ఆది మంచి గుర్తింపు అందుకుంటున్నాడు. ఆది పినిశెట్టి తండ్రి రవి రాజా పినిశెట్టి 80, 90ల కాలంలో అగ్ర దర్శకుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన పెద్దకొడుకు సత్య ప్రసాద్ దర్శకుడిగా కొనసాగుతుండగా ఆది పినిశెట్టి మాత్రం ఇలా విభిన్నమైన నటుడిగా గుర్తింపు అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
This post was last modified on March 26, 2022 6:21 pm
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…
గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…
భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం చిక్కుబడిపోయారు.…
పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకూ భీకరంగా మారుతోంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్..…
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్టు…
ఒక హిట్టు లేదా ఫ్లాపుని బట్టి డైరెక్టర్ సత్తాని అంచనా వేయలేం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలు ఇలాంటి విషయాల్లో…