Movie News

‘ఉస్తాద్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు లేదు?

స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్‌గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు కూడా తమ సినిమాల్లో కచ్చితంగా ఐటెం సాంగ్స్ పెడుతుంటారు. హరీష్ శంకర్ సినిమాలు గమనించినా.. చాలా వరకు ఐటెం సాంగ్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌తో హరీష్ రూపొందించిన ‘గబ్బర్ సింగ్’లో ‘కెవ్వు కేక’ అంటూ సాగే ఐటెం సాంగ్ జనాలను ఎలా ఊపు ఊపేసిందో.. సినిమాకు ఎంత ఆకర్షణగా మారిందో తెలిసిందే. 

కానీ పవన్‌తో హరీష్ చేసిన కొత్త చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ అలాంటి ఒక పాట ఆశించారు ఫ్యాన్స్. కానీ ఇప్పటిదాకా అలాంటి పాట ఉన్న సంకేతాలేమీ కనిపించలేదు. తర్వాత కూడా అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని హరీష్ శంకర్ స్వయంగా క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ పెట్టకూడదని ముందే నిర్ణయం తీసుకున్నట్లు హరీష్ వెల్లడించాడు.

‘గబ్బర్ సింగ్’ చేసే సమయానికి పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే. కానీ ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత. పైగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా. ఆ హోదాలో ఉంటూ.. ఐటెం సాంగ్స్ లాంటివి చేయడం ఆయన స్థాయికి తగదు.

అందుకే అలాంటి పాట ఏదీ పెట్టలేదని హరీష్ స్పష్టం చేశాడు. పవన్ కళ్యాణ్ ఒక ఐటెం గర్ల్ వెనుక పడుతూ.. పాటలు పాడితే చూడ్డానికి బాగుండదని.. ఉప ముఖ్యమంత్రి హోదాకు గౌరవం ఇవ్వాలని.. అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఐటెం సాంగ్ పెట్టలేదని హరీష్ వెల్లడించాడు. 

రీఎంట్రీలో పవన్ చేసిన సినిమాలు వేటిలోనూ నిఖార్సయిన ఐటెం సాంగ్ లేదు. ‘హరిహర వీరమల్లు’లో మాత్రం అనసూయ, పూజిత పొన్నాడలతో కలిసి ఒక స్పెషల్ సాంగ్ చేశాడు పవన్. దాన్ని కూడా ఐటెం సాంగ్ గాటన కట్టలేం. ఇక ముందు కూడా పవన్ ఆ తరహా పాటలు చేసే అవకాశం లేనట్లే.

This post was last modified on March 9, 2026 7:41 pm

Share

Recent Posts

బిసి సెంటర్స్‌లో ‘రిపీట్’ కావడం లేదా

మొన్న శుక్రవారం విడుదలైన ఈ నగరానికి ఏమైంది రిపీట్ అంచనాలకు మించి హైదరాబాద్, ఓవర్సీస్ లో అదరగొడుతోంది. వసూళ్లు ఊహించిన…

3 hours ago

ఓమ్‌లో ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయో

టాక్ మిశ్రమంగా ఉన్నా ఓమ్ వసూళ్లు బాగున్నాయి. వీకెండ్ తర్వాత ఎంత శాతం డ్రాప్ ఉంటుందనేది రెండు రోజులు ఆగితే…

4 hours ago

భోగి మంటల్లో శత్రువుల దహనం

టాలీవుడ్ తెరమీద రక్తధారలు కొనసాగుతున్నాయి. హీరోలు మారుతున్నా వయొలెన్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కాసులు కురిపించే దిశగా ప్రేక్షకులు ముందుకు…

5 hours ago

యూపీ సీఎంలా పాలిస్తానంటున్న ఏపీ స్వామీజీ

ఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ ఓ స్వామీజీ కూడా ఎన్నిక‌ల రంగంలోకి దిగారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా మడకశిర నియోజ‌క‌వ‌ర్గంలోని…

5 hours ago

జ‌గ‌న్ ప‌ట్టు.. ష‌ర్మిల పంతం.. ముదిరిన ప్యాలెస్ వివాదం!

త‌న కుమార్తె అంజ‌లి పెళ్లిని బెంగ‌ళూరులోని య‌ల‌హంక ప్యాలెస్‌లో చేస్తామ‌ని ప్ర‌క‌టించిన ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల పంతం ఒక‌వైపు..…

6 hours ago

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో `ప‌ట్టింపు` లేదు.. ఎవ‌రైనా పోటీ చేయండి: జ‌న‌సేన‌

ఏపీలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల కోలాహ‌లం జ‌రుగుతున్న క్ర‌మంలో జ‌న‌సేన పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఎన్నిక‌ల్లో ఎలాంటి…

6 hours ago