ఆర్ఆర్ఆర్ విడుదల ముంగిట తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి హైప్ మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజిలో జరిగాయి. తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే కర్ణాటకలోనూ క్రేజ్ మామూలుగా లేదు. ఓవర్సీస్‌లోనూ హైప్ తక్కువగా లేదు. కానీ ఇండియాలో మిగతా చోట్ల మాత్రం బుకింగ్స్ అనుకున్నంతగా కనిపించలేదు. సినిమాకు ఆశించినంత హైప్ లేనట్లు కనిపించింది. సోషల్ మీడియా ట్రెండ్స్ చూసినా ఇదే పరిస్థితి.
ఉత్తరాదిన కశ్మీర్ ఫైల్స్ హవా ముందు ఆర్ఆర్ఆర్ నిలవలేకపోతున్నట్లు కనిపించింది. ముందు రోజు వరకు ఇదే పరిస్థితి. ఐతే సినిమా రిలీజైతే పరిస్థితి మారుతుందని చిత్ర బృందం ఆశాభావంతో ఉంది. వారి నమ్మకమే ఫలించినట్లు కనిపిస్తోంది. రిలీజ్ రోజు ఆర్ఆర్ఆర్‌కు అన్ని చోట్లా హైప్ పెరిగిపోయినట్లే ఉంది.
ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్‌కు పూర్తిగా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ఈ విషయంలో క్రిటిక్స్‌ను మేనేజ్ చేశారని అనుకోవడానికేమీ లేదు. అందరూ ఇలా మూకుమ్మడిగా సినిమాను లేపరు.
రేటింగ్స్ తెలుగు రివ్యూలను మించి వచ్చాయి. మౌత్ టాక్ బాగుంది. సోషల్ మీడియాలో అయితే మామూలు జనాలు సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. హిందీ జనాలు సినిమా చూసి ఫిదా అయిపోయినట్లే కనిపిస్తోంది. సినిమాకు కౌంటర్ బుకింగ్స్ అనుకున్న దాని కంటే ఎక్కువగా ఉన్నాయి. సినిమాకు ఉదయం నుంచే హౌస్ ఫుల్స్ పడ్డాయి.
సాయంత్రానికి కలెక్షన్లు ఇంకా పెరిగినట్లు ట్రెండ్ కనిపిస్తోంది. తమిళనాడులో ఆర్ఆర్ఆర్‌కు రెస్పాన్స్ మామూలుగా లేదు. పుష్ప లాగే ఈ చిత్రానికి కూడా అనూహ్యంగా క్రేజ్ పెరిగిపోయింది. సాయంత్రానికి స్క్రీన్లు, షోలు పెరిగిపోయాయి. ఫుల్స్ పడిపోయాయి. కేరళలో కూడా సినిమాకు మంచి స్పందనే కనిపిస్తోంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on March 25, 2022 10:05 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…