ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది. బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందించిన మెగా మూవీ ఆర్ఆర్ఆర్ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన సినిమాలకు ఎంత భారీ అంచనాలతో వచ్చినా.. అంతకుమించి ఔట్‌పుట్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే రాజమౌళి మరోసారి తన మాయాజాలాన్ని వెండితెరపై ప్రదర్శించాడు. కథ విషయంలో కొంత అసంతృప్తి ఉన్నా.. తనకే సాధ్యమైన విజువల్ మాయాజాలంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న జక్కన్నపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
సామాన్య ప్రేక్షకుల నుంచి.. సెలబ్రెటీల వరకు జక్కన్నను గొప్పగా కొనియాడుతున్నారు. ఆ ప్రశంసల్లో కూడా ఒకటి చాలా ప్రత్యేకమైందిగా చెప్పాలి. అది జక్కన్న సహచర స్టార్ డైరెక్టర్లలో ఒకడైన సుకుమార్ ఇచ్చిన కాంప్లిమెంట్. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చాలామంది సుదీర్ఘంగా పోస్టులు పెడుతున్నారు కానీ.. సుకుమార్ చాలా షార్ట్‌గానే జక్కన్న గొప్పదనాన్ని తన కామెంట్ రూపంలో తెలియజేశాడు.
*మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి.
మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి..
రాజమౌళి సార్..
మీకూ మాకూ ఒకటే తేడా..
ఇలాంటి సినిమా మీరు తీయగలరు మేం చూడగలం. అంతే..*
సుకుమార్.
ఇదీ సూటిగా, సుత్తి లేకుండా సుకుమార్.. రాజమౌళిని కొనియాడిన పోస్ట్. రాజమౌళి సమకాలీన దర్శకుడై ఉండి, తనకూ గొప్ప స్థాయి ఉన్నప్పటికీ.. ఏ భేషజం లేకుండా రాజమౌళికి రాజమౌళే సాటి అని, ఆయనలా ఇంకెవరూ సినిమా తీయలేరని కొనియాడుతూ తన హుందాతనాన్ని చాటుకున్న సుకుమార్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
This post was last modified on March 25, 2022 9:59 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…