ఒక పెద్ద టౌన్లో ఒక పది థియేటర్లుంటే.. ఏదైనా పెద్ద సినిమా రిలీజైనపుడు తొలి రోజు లేదా తొలి వారం వరకు రెండు మూడు థియేటర్లలో ఆడించేవాళ్లు. ఆ తర్వాత సింగిల్ థియేటర్లో సినిమా నడిచేది. అప్పట్లో సినిమాలకు లాంగ్ రన్ ఉండేది కాబట్టి ఒక్క థియేటర్లోనే ఎక్కువ రోజులు ఆడేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. లాంగ్ రన్‌కు ఛాన్సే లేకపోయింది. అర్ధశత దినోత్సవాలు, శత దినోత్సవాలు అటకెక్కేశాయి. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత మంచి టాక్ తెచ్చుకున్నాయి.
గరిష్టంగా మూడు వారాలకు మించి నడవట్లేదు. అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ అదే సినిమాను వేసేసి వీకెండ్ వరకు మాగ్జిమం వసూళ్లు లాగేయడమే ఇప్పుడు నడుస్తున్న వ్యవహారం. అందులోనూ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమా రిలీజైనపుడు ఏ థియేటరునైనా వేరే సినిమాకు ఎలా విడిచిపెడతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ ఈ సినిమానే ఆడించబోతున్నారు.
ఏపీలో అయితే విశాఖపట్నం, విజయవాడ లాంటి కొన్ని సిటీల్లో ఒకటీ అరా షోలు ‘కశ్మీర్ ఫైల్స్’కు విడిచిపెట్టి ప్రతి థియేటర్లో, ప్రతి షో కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమానే నడిపించబోతున్నారు. వీకెండ్ అంతా ఇదే పరిస్థితి ఉండబోతోంది. హైదరాబాద్‌లో నార్త్ ఇండియన్స్ సంఖ్య కాస్త ఎక్కువే కావడంతో సింగిల్ స్క్రీన్లు ఒక రెండు.. మల్టీప్లెక్సుల్లో కొన్ని షోలు మాత్రమే ‘కశ్మీర్ ఫైల్స్’కు కేటాయించారు. మొత్తంగా ఆ సినిమాకు శుక్రవారం కేటాయించిన షోలు 15 మాత్రమే. ఆల్రెడీ థియేటర్లలో ఆడుతున్న ‘రాధేశ్యామ్’ సహా అన్ని చిత్రాలనూ శుక్రవారం తీసేస్తున్నారు.
మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్లలో ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టి.. అర్ధరాత్రి 2 గంటల వరకు ‘ఆర్ఆర్ఆర్’ షోలు నడవబోతున్నాయి. ఇంతకుముందు ‘బాహుబలి-2’కు ఇలా మాగ్జిమం షోలు కేటాయించారు. అప్పటితో పోలిస్తే హైదరాబాద్‌లో స్క్రీన్లు పెరిగాయి. షోలు కూడా ఎక్కువ అవుతున్నాయి. పైగా టికెట్ల ధరలు కూడా పెరిగాయి కాబట్టి ఆ సినిమా వసూళ్ల రికార్డును ‘ఆర్ఆర్ఆర్’ అలవోకగా దాటేయబోతోంది.
This post was last modified on March 25, 2022 10:16 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…