‘ఆర్ఆర్ఆర్’ సినిమా ‘బాహుబలి’లా తెలుగు రాష్ట్రాల అవతల మ్యాజిక్ చేస్తుందా లేదా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ వచ్చారు. చిత్ర బృందంలోనూ ఈ విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఐతే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆశించిన స్థాయిలో లేవు. దక్షిణాదిన పరిస్థితి మెరుగే కానీ.. నార్త్ ఇండియాలో మాత్రం అనుకున్నంతగా హైప్ కనిపించడం లేదు. అక్కడ టికెట్ల కోసం ఎగబడుతున్న పరిస్థితి లేదు. సోల్డ్ ఔట్ షోలు పెద్దగా కనిపించడం లేదు.
ఢిల్లీ, ముంబయి లాంటి పెద్ద సిటీల్లో ఆక్యుపెన్సీ తక్కువగా కనిపిస్తోంది. అక్కడ ‘కశ్మీర్ ఫైల్స్’ ప్రభంజనం కొనసాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇంకా వారి దృష్టిని ‘ఆర్ఆర్ఆర్’ ఆకర్షిస్తున్నట్లు కనిపించడం లేదు. మొత్తానికి అడ్వాన్స్ బుకింగ్స్ వరకు చూసుకుంటే ‘ఆర్ఆర్ఆర్’ టీంకు నిరాశ తప్పట్లేదు. ఈ చిత్రం ‘సాహో’ డే-1 వసూళ్లను కూడా దాటేలా లేదు. ‘సాహో’ తొలి రోజు నార్త్ ఇండియాలో రూ.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
‘ఆర్ఆర్ఆర్’ తొలి రోజు వసూళ్లు రూ.20 కోట్ల లోపే ఉంటాయని ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. ఐతే ఆన్ లైన్లో అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ఆశాజనకంగా లేకపోయినా.. తొలి రోజు కౌంటర్ బుకింగ్ అంచనాల్ని మించుతుందని జక్కన్న అండ్ కో ఆశిస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచే సినిమాకు టాక్ మొదలవుతుంది కాబట్టి ‘బాహుబలి’ లాగే ఈ చిత్రానికీ అదిరిపోయే టాక్ వస్తుందని అనుకుంటున్నారు.
కాబట్టి అప్పుడు నార్త్ ఇండియన్స్‌లో ఎగ్జైట్మెంట్ వస్తుందని.. ఉదయానికి థియేటర్లకు పరుగులు పెడతారని.. కచ్చితంగా ఫుట్ ఫాల్స్ పెరుగుతాయని.. సినిమా వీకెండ్లో మెజారిటీ షోలు హౌస్ ఫుల్స్‌తో నడవడం గ్యారెంటీ అని అంచనా వేస్తున్నారు. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ రిజల్ట్ గురించి ఇప్పుడే ఒక అంచనాకు రావడం కరెక్ట్ కాదేమో. ‘బాహబలి: ది బిగినింగ్’ టైంలో కూడా ఇలాగే జరగడం గమనార్హం.
This post was last modified on March 24, 2022 8:08 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…