Movie News

నాన్ బాహుబలి.. ఇక చరిత్రే

ఏడేళ్ల ముందు వరకు ఇండస్ట్రీ హిట్, ఆల్ టైమ్ రికార్డ్ అన్న మాటలు వాడేవాళ్లం. కానీ ‘బాహుబలి’ ఆగమనంతో ఈ మాటలు పక్కకు వెళ్లిపోయాయి. ‘నాన్ బాహుబలి రికార్డ్స్’ అనే కొత్త మాట ఒకటి తెరపైకి వచ్చింది. ఆ రికార్డులు వేరు.. మిగతా సినిమా రికార్డులు వేరు అన్నట్లు చూడటం మొదలైంది. అసాధారణ వసూళ్లు సాధించిన ఆ సినిమాతో వేరే చిత్రాలను పోల్చడానికి ఇబ్బందిగా మారింది.

వేరే సినిమాల రికార్డులను ‘నాన్-బాహుబలి’ కేటగిరీలో పెట్టడం మొదలైంది. ఓవరాల్‌గా ‘బాహుబలి’ రికార్డులను కొట్టడం సంగతి అలా ఉంచితే.. ఆ ఆలోచన చేయడానికి కూడా భయపడే పరిస్థితి తలెత్తింది. అప్పుడప్పుడు ఏదో ఒక ఏరియా వరకు మాత్రమే బాహుబలి రికార్డులు బద్దలవడం చూశాం కానీ.. ఓవరాల్‌గా దాని రికార్డుల జోలికి వెళ్లే పరిస్థితి ఎంతమాత్రం లేదు. తెలుగు సినిమాలే కాదు.. హిందీ చిత్రాలు సైతం ‘బాహుబలి’ రికార్డులు బద్దలు కొట్టలేకపోయాయి.

దీంతో ‘నాన్ బాహుబలి’ అనే కేటగిరీ ఎప్పటికీ నిలిచిపోయేలా కనిపించింది.కానీ ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ఆగమనంతో ఎట్టకేలకు ‘బాహుబలి’ రికార్డులు బద్దలయ్యేలా కనిపిస్తున్నాయి. తన పేరిట ఉన్న రికార్డులను మళ్లీ రాజమౌళి బద్దలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ బడ్జెట్, బిజినెస్ పరంగా ‘నాన్ బాహుబలి’ అనే మాట పక్కకు వెళ్లిపోయింది. నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు నమోదయ్యాయి. వసూళ్ల పరంగా కూడా ఇకపై ఇదే మాటను వాడబోతున్నామన్నది స్పష్టం.

‘ఆర్ఆర్ఆర్’కు ఉన్న హైప్, దానికి బాక్సాఫీస్ దగ్గర కలిసొస్తున్న పరిస్థితులు చూస్తుంటే.. తెలుగు రాష్ట్రాల వరకు బాహుబలి రికార్డులన్నీ బద్దలు కావడం లాంఛనం లాగే కనిపిస్తోంది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చి, మిగతా ప్రాంతాల్లోనూ ప్రేక్షకులు బాహుబలి చూడ్డానికి ఎగబడినట్లు ఎగబడితే.. ఓవరాల్ బాహుబలి రికార్డులన్నీ కూడా బద్దలైపోవడం ఖాయం. అదే జరిగితే.. ఇక ముందు ‘నాన్ ఆర్ఆర్ఆర్’ రికార్డులు అంటూ కొత్త మాటను ప్రతిసారీ వాడటం చూస్తాం. ‘నాన్ బాహుబలి’ అనే విభాగం చరిత్రలో కలిసిపోతుంది.

This post was last modified on March 24, 2022 3:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago