Movie News

రామ్-భీమ్‌.. విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఓటెవ‌రికంటే?

ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియ‌ర్ ఎన్టీఆర్ చేసిన కొమ‌రం భీమ్.. రామ్ చర‌ణ్ పోషించిన అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ల్లో ఏది హైలైట్ అవుతుంద‌నే విష‌యంలో అంద‌రిలోనూ ఉత్కంఠ ఉంది. ఈ విష‌యంలో ఇద్ద‌రు హీరోల అభిమానుల మ‌ధ్య ఎప్ప‌ట్నుంచో ఫైట్ న‌డుస్తోంది. ఐతే గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి పాత్ర ప‌రంగా త‌న ఫేవ‌రెట్ చ‌ర‌ణ్ చేసిన రామ‌రాజు క్యారెక్ట‌రే అన్నాడు.

ఇప్పుడు రాజ‌మౌళి తండ్రి, ఆర్ఆర్ఆర్ క‌థ‌కుడు విజ‌యేంద్ర ప్ర‌సాద్ సైతం ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం విశేషం. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఆర్ఆర్ఆర్‌లోని రెండు ప్ర‌ధాన పాత్ర‌ల‌ను విశ్లేషించారు. ఈ రెండు పాత్ర‌ల్లో త‌న‌కు ఏది ఎక్కువ ఇష్ట‌మో వెల్ల‌డించారు.

ట్రైల‌ర్ స‌హా ప్రోమోల్లో చూస్తే కొమ‌రం భీమ్ వెంట‌నే ఆక‌ట్టుకుంటుంద‌ని, అడ‌వి బిడ్డ పాత్ర చేయ‌డం వ‌ల్ల ఆ పాత్ర చూడ‌గానే ఆక‌ట్టుకుంటుంద‌ని, అడ‌విలో ఒక పువ్వునో, ఒక జంతువునో చూస్తే అవి ఎంత స్వ‌చ్ఛంగా క‌నిపిస్తాయో అలాంటి పాత్రే ఇద‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ అన్నారు. ఇక చ‌రణ్ చేసిన రామ‌రాజు పాత్ర గురించి చెబుతూ.. ఇది సంక్లిష్ట‌మైన పాత్ర అని, దీనిలో చాలా లేయ‌ర్స్ ఉంటాయ‌ని.. లోలోన ఎంతో బాధ ప‌డుతూ, సంఘ‌ర్ష‌ణ అనుభ‌వించే పాత్ర ఇద‌ని అన్నారు.

సినిమాలో తార‌క్ చ‌ర‌ణ్‌ను అన్న అని పిలుస్తాడ‌ని, కాబ‌ట్టి చ‌ర‌ణ్ చేసింది ప‌రిణ‌తితో కూడిన‌, పెద్ద వాడి పాత్ర అని.. ఈ పాత్ర‌ను పోషించ‌డం కూడా చాలా క‌ష్ట‌మ‌ని విజ‌యేంద్ర అన్నారు. వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, కానీ ఈ సినిమా వ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్‌కు తాను రెండు మార్కులు ఎక్కువ వేస్తాన‌ని.. ఇందుకు పాత్ర‌లో ఉన్న సంక్లిష్ట‌త, లేయ‌ర్సే కార‌ణ‌మ‌ని విజ‌యేంద్ర విశ్లేషించారు. బేసిగ్గా అల్లూరి సీతారామ‌రాజు అంటే బాగా పాపుల‌ర్ అయిన క్యారెక్ట‌ర్,పైగా  తెలుగువాళ్ల‌కు దాంతో ఉన్న ఎమోష‌న‌ల్ క‌నెక్ష‌న్ వ‌ల్ల దీనికే సినిమాలో ఎలివేష‌న్ ఎక్కువ ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. అలాగ‌ని తార‌క్ చేసిన భీమ్ పాత్ర‌ను రాజ‌మౌళి త‌గ్గించి అయితే ఉండ‌డు, బ్యాలెన్స్ చేయ‌డానికే ప్ర‌య‌త్నించి ఉంటాడ‌ని భావించ‌వ‌చ్చు.

This post was last modified on March 24, 2022 8:30 am

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

46 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

54 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago