ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ విడుదలకు ఇంకొక్క రోజే మిగిలుంది. మామూలుగా పెద్ద సినిమాలకు ముందుగా షో పడేది యుఎస్‌లోనే. అక్కడ ముందు రోజే ప్రిమియర్లు వేస్తారన్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం రిలీజ్ రోజుకు ముందు రోజు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో యుఎస్ ప్రిమియర్ షోలు మొదలవుతుంటాయి.
ఒకప్పుడైతే ఆంధ్రప్రదేశ్‌లో కూడా క్రేజును బట్టి అర్ధరాత్రి దాటాక బెనిఫిట్ షోలు పడేవి. కానీ ఇప్పుడవి లేవు. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా షో పడుతున్నది హైదరాబాద్‌లోనే. తెల్లవారుజామున 4-5 గంటల మధ్య ఒకట్రెండు థియేటర్లలో బెనిఫిట్ షోలు వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు హైదరాబాద్ సిటీలో ఇదే సమయంలో కొన్ని షోలు ప్లాన్ చేశారు. ఐతే అంతకంటే ముందే ముందు రోజు రాత్రి సెకండ్ షో సమయానికి రెండు సిటీల్లో స్పెషల్ షోలు పడబోతున్నాయి.
ముందు మార్చి 24న రాత్రి సెకండ్ షోకు అన్ని చోట్లా పెయిడ్ ప్రిమియర్స్ వేయాలనుకున్నా.. తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఆలోచన మార్చుకున్నారు. అవి క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం మెంబర్సే ముందు రోజు రాత్రి రెండు స్పెషల్ షోలు ప్లాన్ చేసుకున్నారు. అందులో ఒకటి ఎక్స్‌క్లూజివ్‌గా జూనియర్ ఎన్టీఆర్ తన వాళ్ల కోసం ప్లాన్ చేసుకున్న షో కావడం విశేషం. హైదరాబాద్ ఏఎంబీ మాల్‌లో ఒక స్క్రీన్‌ను తారక్ తీసుకున్నాడు.
తన కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులైన 50 మంది కోసం ఏర్పాటు చేసుకున్న షో ఇది. రిక్లైనర్లతో ఉండే చిన్న స్క్రీన్‌ను తారక్ కోసం కేటాయించారు. మరోవైపు ముంబయిలో అదే సమయానికి బాలీవుడ్ సెలబ్రెటీలు, మీడియా కోసం స్పెషల్ ప్రిమియర్ షో వేస్తున్నారట. ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్‌కు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేకపోవడంతో సెలబ్రెటీ టాక్‌తో హైప్ పెంచడానికి ఈ షోను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on March 23, 2022 9:00 pm
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…