Movie News

BoycottRRR ట్రెండింగ్.. జెట్ స్పీడ్ రియాక్షన్

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మెగా కాంబినేషన్లో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుండగా.. BoycottRRR  అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే ఇలాంటి నెెగెటివ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం ఏంటి అని ఆశ్చర్యం కలగొచ్చు.

ఈ చిత్రంలో ఎవరినైనా కించపరిచే, ఎవరి మనోభావాలైనా దెబ్బ తీసే సన్నివేశాలు ఉన్నాయేమో అన్న సందేహాలు కలగొచ్చు. ఐతే ఇక్కడ వ్యవహారం వేరు. ఈ ట్రెండ్‌లో భాగస్వాములు అవుతున్నది కన్నడిగులు కావడం గమనార్హం. ‘ఆర్ఆర్ఆర్’ను కన్నడలో రిలీజ్ చేయకపోవడమే వారి ఆగ్రహానికి కారణం. ‘ఆర్ఆర్ఆర్’ ప్రోమోలను కన్నడలో రిలీజ్ చేసి, కర్ణాటకకు వెళ్లి పెద్ద ఎత్తున సినిమాను ప్రమోట్ చేసి.. చివరికి కన్నడ వెర్షన్‌ను రిలీజ్ చేయకపోవడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

ఐతే పాన్ ఇండియా సినిమాల విషయంలో ప్రతిసారీ ఇలాగే జరుగుతుండటమే కన్నడిగుల ఆగ్రహానికి కారణం. గత ఏడాది చివర్లో వచ్చిన ‘పుష్ప’ చిత్రాన్ని కూడా కర్ణాటకలో చాలా వరకు తెలుగులోనే రిలీజ్ చేశారు. కన్నడ వెర్షన్ ఏదో నామమాత్రంగా విడుదలైంది. అప్పుడు కూడా కన్నడిగులు ఇలాగే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే ఈ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేది కన్నడిగులే. థియేటర్లూ వాళ్లవే. డిమాండును బట్టే ఏదైనా జరుగుతుంది.

బెంగుళూరు సహా కర్ణాటకలోని పెద్ద సిటీల్లో తెలుగు వాళ్లు ఎక్కువ. తెలుగు వెర్షన్‌కే డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్లే స్క్రీన్లు, షోలు కేటాయిస్తున్నారు. కానీ ‘పుష్ఫ’ సంగతెలా ఉన్నప్పటికీ.. ‘ఆర్ఆర్ఆర్’ స్థాయి పెద్దది కాబట్టి కన్నడలో దానికి ఓ మోస్తరుగా అయినా స్క్రీన్లు ఇవ్వాల్సింది. కానీ బుక్ మై షో తెరిస్తే.. బెంగళూరు సిటీలో అసలు కన్నడ వెర్షన్ ఆప్షనే చూపించట్లేదు. ఇదే కన్నడిగుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను బహిష్కరించాలంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. ఇక జెట్ స్పీడ్ లోనే ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. RRR ను కన్నడలో విడుదల చేస్తున్న KVN ప్రొడక్షన్ సంస్థ స్పందించి ఎక్కువ థియేటర్సలో కన్నడ వెర్షన్ ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

This post was last modified on March 23, 2022 5:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ

ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…

5 minutes ago

ఎంపీలో ఘోరం!… శోభనానికి ముందు కన్యత్వ పరీక్ష!

దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…

21 minutes ago

‘సిండికేట్’ : ఆర్జీవీ పాపాలను కడగనుందా?

రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…

26 minutes ago

టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. భారత్ అభ్యంతరం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…

41 minutes ago

వివాదాలు ఓకే….అసలు విషయం వీకే

తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…

42 minutes ago

టికెట్ల ధరల మర్మం తెలిసిందా?

కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…

54 minutes ago