ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ఇంకెంతో సమయం లేదు. ఇంకొక్క రోజు వ్యవధిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేయబోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ సినిమాకు, ఇక్కడి థియేటర్లకు చాలా కొత్త అయిన, ఐమాక్స్‌ను మించిన క్వాలిటీతో ఉండే డాల్బీ విజన్లోనూ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. యుఎస్‌లో ఈ టెక్నాలజీకి సింక్ అయిన థియేటర్లను పెద్ద సంఖ్యలోనే ఈ సినిమాకు కేటాయించారు.
ఆ స్క్రీన్లలో ఈ సినిమా చూడటం అద్భుత అనుభూతినిస్తుందని అంటున్నారు. మన దగ్గర ఆ తరహా థియేటర్లు అందుబాటులో లేకపోవడం నిరాశ కలిగించే విషయమే. ఐతే ఇక్కడి ప్రేక్షకులకు కాస్త భిన్నమైన అనుభూతిని పంచడానికి త్రీడీలోనూ ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేస్తుండటం తెలిసిందే. పరిమిత స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ త్రీడీ వెర్షన్ విడుదలవుతోంది.
ఐతే విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా సాగే సినిమాలకైతే త్రీడీ ఓకే అనుకోవచ్చు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి యాక్షన్ డ్రామాకు త్రీడీతో వచ్చే అదనపు ప్రయోజనం ఏముంటుందన్నది ప్రశ్న. అసలు త్రీడీ అంటే తనకు నచ్చదని చెప్పే రాజమౌళి ఈ సినిమాను ఆ వెర్షన్లో ఎందుకు రిలీజ్ చేయిస్తున్నాడన్న సందేహం కూడా కలుగుతోంది. దీనికి జక్కన్న ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చాడు. తనకు బేసిగ్గా త్రీడీ అంటే నచ్చదని, గతంలో చాలాసార్లు ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పానని.. త్రీడీ చేస్తే విజన్ చిన్నదైపోతుందనే కారణంతోనే తాను దానికి దూరమని అందుకే ముందు ‘ఆర్ఆర్ఆర్’ను త్రీడీలో రిలీజ్ చేయాలన్న ఆలోచనే చేయలేదని రాజమౌళి తెలిపాడు.
ఐతే ఈ సినిమా జనవరి నుంచి వాయిదా పడ్డాక.. ఒక త్రీడీ కంపెనీ టీం తనను కలిసి సినిమా నుంచి కొన్ని షాట్లు తమకు ఇవ్వమని, త్రీడీ వర్క్ చేసి ఇస్తామని, నచ్చితేనే ఓకే చేయండని, లేదంటే వద్దని అందని.. తాను అయిష్టంగానే ఐదారొందల షాట్లను వాళ్లకు ఇచ్చానని.. వాళ్లు ఔట్ పుట్ ఇచ్చాక ‘నో’ అందామన్న ఉద్దేశంతోనే అవి చూడటానికి వెళ్లానని, ఐతే అవి చూశాక తన అభిప్రాయం మారిపోయిందని రాజమౌళి తెలిపాడు. ప్రధాన పాత్రలు మన దగ్గరగా వచ్చి భావోద్వేగాలను పంచుకుంటున్న ఫీలింగ్ కలిగిందని.. దీని వల్ల సినిమా ప్రేక్షకులకు మరింతగా చేరువ అవుతుందన్న ఉద్దేశంతో త్రీడీకి ఓకే చెప్పానని అసలు విషయం వెల్లడించాడు.
This post was last modified on March 23, 2022 2:20 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…