మనం అభిమానించే సంగీత దర్శకుడి నుంచి వచ్చిన మంచి పాటలు చెప్పమంటే ఈజీగా చెప్పేస్తాం కానీ.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన పాటల్లో నచ్చనివేవో చెప్పమంటే సమాధానం కొంచెం కష్టమే. నచ్చిన పాటల్ని గుర్తు పెట్టుకుని ఠకీమని చెప్పేస్తాం కానీ.. ఏ పాట నచ్చలేదంటే మాత్రం తటపటాయించాల్సిందే.
కానీ ఏ ప్రశ్న అడిగినా ఠక్కున సమాధానం చెప్పే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం.. తన పాటల్లో నచ్చనివేవో చెప్పమంటే వెంటనే బదులిచ్చేశాడు. అక్కినేని నాగార్జున సినిమా ఘరానా బుల్లోడులోని భీమవరం బుల్లోడా పాట అంటే తనకు నచ్చదని చెప్పాడు. ఈ సినిమాకు కీరవాణే సంగీత దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలోని హిట్ పాటల్లో భీమవరం బుల్లోడా.. కూడా ఒకటి. అప్పట్లో అది సూపర్ హిట్టయింది కూడా. ఐతే మాస్ ప్రేక్షకులు బాగా మెచ్చిన ఆ పాట.. తారక్‌కు మాత్రం అస్సలు ఇష్టం లేదట.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్, కీరవాణిలతో కలిసి ఓ చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న తారక్.. ఎందుకో తెలియదు కానీ తనకు భీమవరం బుల్లోడా పాట అంటే చిరాకని చెప్పాడు. ముఖ్యంగా అందులోని లిరిక్స్ పట్ల తనకు అభ్యంతరాలున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ పాట పాడి వినిపిస్తూ జింకు చకుం అనే సౌండ్ దగ్గర తారక్ ఇబ్బందిగా ఫీలవడం కనిపించింది.
ఆ పాటలో కొంతమేర బూతు టచ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదే తారక్‌కు ఇబ్బందిగా మారి ఉండొచ్చు. ఐతే తన పాటల్లో నచ్చనిదేదైనా ఉందా అని చరణ్‌ను అడిగితే అతను సమాధానం చెప్పలేకపోయాడు. గత ఏడాది రిలీజైన ఒక సినిమాలో పాట తనకు నచ్చలేదన్నాడు కానీ, ఆ సినిమా ఏదో ఆ పాటేదో గుర్తులేదు అన్నాడు. ఐతే భీమవరం బుల్లోడా పాట సంగతేమో కానీ.. కీరవాణి సంగీతం అంటే తారక్‌కు చాలా ఇష్టం. ఆయన స్వరపరిచిన రాలిపోయే పువ్వా పాటకు తాను ఎంతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయినట్లు గతంలో చెప్పాడు. ఇక తారక్ అంటే కీరవాణికి అమితమైన అభిమానం. తనతో పాటు తమ కుటుంబంలో అందరూ తారక్ ఫ్యాన్సే అని, అతణ్ని తమ కుటుంబంలో ఒకడిగా భావిస్తామని చెబుతుంటాడు కీరవాణి.
This post was last modified on March 22, 2022 11:38 am
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…
ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…
రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్ స్క్రీన్…
సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…
ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…
చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…