రెండేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసబెట్టి రీమేక్‌లతో సాగిపోతున్నాడు. ఆయన రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ హిందీ మూవీ ‘పింక్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ నుంచి వచ్చిన ‘భీమ్లా నాయక్’ ఏమో మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ ఆధారంగా తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలతో పవన్ ఎంతగా అలరించినా.. అవి రీమేక్‌లు కావడం వల్ల ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ తగ్గిపోయింది.
ఓటీటీ విప్లవం వల్ల మామూలుగానే అన్ని భాషల్లో హిట్ చిత్రాలను జనాలు చూసేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నాడంటే ఇంకా ఎక్కువమంది ముందే సినిమా చూసేయడం గ్యారెంటీ. ఇందువల్లే ఎగ్జైట్మెంట్ తగ్గిపోతోంది. ఈ సినిమాలు ఒక స్థాయికి మించి బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించకపోవడానికి రీమేక్‌లు కావడం కూడా ఒక కారణమే. అయినా పవన్ ఏమీ తగ్గట్లేదు. ఆయన ఇంకో రీమేక్‌ను లైన్లో పెట్టినట్లు వార్తలొస్తున్నాయి.
తమిళంలో మంచి స్పందన తెచ్చుకున్న ‘వినోదియ సిత్తం’ రీమేక్‌లో పవన్ నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నటుడిగా తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు చేసిన సముద్రఖని తాను ముఖ్య పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రమిది. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి, జీ5 ద్వారా నేరుగా ఓటీటీలో రిలీజైన సినిమా ఇది. ఇందులో సముద్రఖని దేవదూత పాత్రలో నటించాడు. తన కుటుంబం, అలాగే తాను పని చేసే ఆఫీసు తన వల్లే నడుస్తాయని భ్రమలో ఉంటూ ఎవరినీ లెక్క చేయకుండా సాగిపోయే ఒక నడి వయస్కుడు హఠాత్తుగా చనిపోవడం.. అతణ్ని తీసుకెళ్లడానికి వచ్చే దేవదూతతో వాదనకు దిగడం.. తర్వాత మళ్లీ మూణ్నెల్ల ఆయుష్షు తీసుకుని భూమి మీదికి రావడం.. ఈ క్రమంలో అనేక జీవిత సత్యాలు తెలుసుకుని, తానొక నిమిత్త మాత్రుడినని అర్థం చేసుకుని తిరిగి పైలోకానికి వెళ్లిపోవడం.. ఇదీ స్థూలంగా కథ. తమిళంలో సముద్రఖని చేసిన దేవదూత పాత్రనే పవన్ తెలుగులో చేస్తున్నట్లున్నాడు.
ఐతే ఇందులో ఆయనతో పాటు సాయిధరమ్ తేజ్ నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒరిజినల్లో నడి వయస్కుడిగా ఉన్న పాత్రను తన కోసం మారుస్తున్నారేమో తెలియదు. ‘పింక్’లో మాదిరి కొత్తగా అనిపించే, హార్డ్ హిట్టింగ్ కథాకథనాలేమీ ఇందులో ఉండవు. ‘అయ్యప్పనుం కోషీయుం’ మాదిరి ఎలివేషన్లకు ఛాన్స్ లేదు. రొటీన్‌గా, ఫ్లాట్‌గా సాగిపోయే సినిమా ఇది. కొంచెం ఎమోషనల్‌గా ఉంటుందంతే. పవన్ ఇమేజ్ ప్రకారం చూస్తే ఇది అస్సలు సెట్టయ్యే సినిమా కాదు. ఇది ఆయన చేయాల్సిన పాత్ర అయితే కాదు. ‘గోపాల గోపాల’ కన్నా సాధారణంగా, అతిథి పాత్రలా అనిపించే క్యారెక్టర్లో పవన్ ఏం చేస్తాడన్నది ప్రశ్నార్థకం.
This post was last modified on March 17, 2022 12:20 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…