రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా అనౌన్స్ చేసినపుడు అంతా ఆశ్చర్యపోయారు. పైకి చెప్పకపోవచ్చు కానీ.. మెగా, నందమూరి కుటుంబాల మధ్య సినిమాల పరంగా ఉన్న వైరం గురించి అందరికీ తెలిసిందే. ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నది. ఆ ఫ్యామిలీ హీరోల మధ్య గొడవలు లేకపోవచ్చు కానీ.. వ్యక్తిగతంగా అంత సాన్నిహిత్యం కూడా కనిపించదు.
ఇక మెగా, నందమూరి అభిమానుల మధ్య గొడవల గురించైతే కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆఫ్ లైన్, ఆన్ లైన్లో విభేదాలు ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తారక్, చరణ్ కలిసి సినిమా చేస్తున్నారంటే అంతా నోరెళ్లబెట్టారు. ఐతే ఆర్ఆర్ఆర్ మేకింగ్ టైంలో ఇద్దరూ చాలా సన్నిహితంగా కనిపించడంతో.. ఈ చిత్రం వీరి మధ్య స్నేహానికి కారణమైందని అంతా అనుకున్నారు.
కానీ తమ స్నేహం ఈనాటిది కాదని, ఎన్నో ఏళ్లదని ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో చెప్పుకొస్తున్నారు తారక్, చరణ్.
తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడితో జరిగిన చిట్ చాట్ కార్యక్రమంలో తమ స్నేహం గురించి అడిగిన ప్రశ్నకు వాళ్లిద్దరూ సమాధానం చెప్పారు. ముఖ్యంగా తారక్ కొంచెం వివరంగానే తమ ఫ్రెండ్షిప్ ముచ్చట్లు చెప్పారు. బయటి ప్రపంచానికి తెలియదు కానీ.. తాము చాలా క్లోజ్ అని తారక్ చెప్పాడు. తమ ఇద్దరి ఇళ్లు నడిచి వెళ్లేంత దగ్గరలో ఉంటాయని.. తన భార్య ప్రణతి పుట్టిన రోజు మార్చి 26 కాగా.. తర్వాతి రోజు చరణ్ బర్త్ డే అని.. ప్రణతి బర్త్ డే రోజు రాత్రి 12 గంట కొట్టగానే తాను కారేసుకుని చరణ్ ఇంటి ముందు నిలబడేవాడినని.. తర్వాత కారేసుకుని అంతా బయటికి వెళ్తుంటామని తారక్ వెల్లడించాడు.
తాను, చరణ్ ఎంత క్లోజో ఒక్క రాజమౌళికే తెలుసని, ఆర్ఆర్ఆర్ షూటింగ్ టైంలో తమ బంధం మరింత బలపడిందని చెప్పాడు. స్టార్ క్రికెట్ టోర్నీ జరిగిన టైంలో తామిద్దరం ఒకరితో ఒకరు క్లోజ్ అయ్యామని.. తాను చాలా దూకుడుగా ఉండే వ్యక్తినైతే, చరణ్ చాలా ప్రశాంతంగా ఉంటాడని, ఈ వైరుధ్యమే తమను దగ్గరికి చేర్చిందని తారక్ తెలిపాడు. చరణ్ కూడా ఇదే తమ బంధం బలపడటానికి కారణమన్నాడు.
This post was last modified on March 16, 2022 8:33 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…