రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే చేసిన సినిమాల్లో అత్యధిక అంచనాలున్నది హరీష్ శంకర్‌తో చేయాల్సిన ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమానే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ అయింది. స్వయంగా పవర్ స్టార్‌కు పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్.. పవన్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించి వారిని ఉర్రూతలూగించారు.
అందులోనూ ఈసారి చేయబోయేది స్ట్రెయిట్ కథ కావడంతో అంచనాలు మరింత ఎక్కువగానే ఉన్నాయి. కానీ రెండేళ్ల కిందటే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చినా.. ఇప్పటికీ ఇది పట్టాలెక్కలేదు. పవన్‌కున్న వేరే కమిట్మెంట్ల వల్ల ఇది ఆలస్యం అవుతోంది. ఐతే ఎంత లేటైనా హరీష్ మాత్రం పక్క చూపులు చూడకుండా ఈ సినిమా మీదే తన ఫోకస్ అంతా నిలిపారు. పవన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు హరీష్.
జూన్ నెలాఖర్లో ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాలని చూస్తున్నట్లు హరీష్ తెలిపాడు. పవన్‌తో తన సినిమా ఆలస్యం అవుతున్నప్పటికీ.. ఈ నిరీక్షణ వృథా కాని విధంగా సినిమా ఉంటుందని చెప్పాడు. స్క్రిప్టు పూర్తయినప్పటికీ.. ఇంకా దానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నానని.. షూటింగ్ మొదలయ్యాక కూడా ఈ పని కొనసాగుతుందని చెప్పాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డేనే కథానాయిక అని ధృవీకరించిన హరీష్.. ఓ కీలక పాత్రకు ‘మీర్జాపూర్’ ఫేమ్ పంకజ్ త్రిపాఠిని సంప్రదిస్తున్నట్లు తెలిపాడు.
కమెడియన్ సత్య కూడా ఈ చిత్రంలో నటిస్తాడన్నాడు. ‘భవదీయుడు భగత సింగ్’ కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే పని మొదలు పెట్టాడని.. ఒక పాట రికార్డింగ్ కూడా పూర్తయిందని, ఇంకో ట్యూన్ కూడా ఓకే అయిందని చెప్పాడు. ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని, పవన్ నుంచి అభిమానులు కోరుకునే మేనరిజమ్స్, హీరో ఎలివేషన్లు అన్నీ ఇందులో ఉంటాయని చెప్పాడు హరీష్. ఈ సినిమాలో పవన్ లెక్చరర్ పాత్ర చేస్తున్నాడా అంటే మాత్రం సమాధానం దాటవేశాడు.
This post was last modified on %s = human-readable time difference 3:36 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…