తమిళంలో స్వశక్తితో ఎంతో కష్టపడి పెద్ద స్టార్‌గా ఎదిగిన నటుడు ధనుష్. వైవిధ్యమైన సినిమాలే అతణ్ని ఆ స్థాయికి తీసుకొచ్చాయి. ఐతే ఈ మధ్య అతణ్నుంచి స్థాయికి తగ్గ సినిమాలు రావట్లేదు. కర్ణన్ మినహాయిస్తే ఆకట్టుకున్న సినిమాలు పెద్దగా లేవు. ఆ చిత్రం కూడా కరోనా టైంలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దాని తర్వాత యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ధనుష్ నటించిన జగమే తంత్రం మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
దీని ప్రోమోలు చూస్తే హాలీవుడ్ రేంజ్ సినిమాలా కనిపించింది. కానీ గత ఏడాది థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. సినిమాలో విషయం లేకపోవడం వల్ల దీన్ని ఓటీటికి ఇచ్చి వదిలించుకున్నారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఐతే ఇప్పుడు ధనుష్ నుంచి వచ్చిన మరో సినిమా సైతం ఇలాంటి విమర్శలే ఎదుర్కొంటోంది. ధనుష్, మాళవిక మోహనన్ జంటగా మరో యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ రూపొందించిన సినిమా.. మారన్. ఈ సినిమా షూటింగ్ మధ్య దశలో ఉండగానే ఓటీటీ డీల్ కుదిరింది. ఇప్పుడు థియేటర్లలోనే సినిమాను రిలీజ్ చేయడానికి అనుకూల పరిస్థితులున్నప్పటికీ ముందే కుదిరిన ఒప్పందం మేరకు హాట్ స్టార్‌లో మారన్‌ను రిలీజ్ చేశారు.
ధనుష్ తొలిసారి జర్నలిస్ట్ పాత్ర చేసిన సినిమా ఇది. ట్రైలర్ చూస్తే పర్వాలేదనిపించింది కానీ.. సినిమా చూసిన వాళ్లకు తీవ్ర నిరాశ తప్పలేదు. మరీ రొటీన్‌గా సాగిపోయిన ఈ మాస్ మసాలా మూవీ చూసి ప్రేక్షకులు దండం పెట్టేస్తున్నారు. ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉంది. థియేటర్లలో రిలీజైతే డిజాస్టర్ అయ్యేదని.. ఓటీటీకి ఇచ్చేసి నిర్మాత బాగానే బయటపడ్డాడని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on March 13, 2022 3:56 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…