Movie News

‘సాహో’కు అలా.. ‘రాధేశ్యామ్’కు ఇలా

ఎంతైనా మాస్ సినిమా మాస్ సినిమానే అని మరోసారి రుజువైంది. ప్రభాస్ చివరి సినిమా ‘సాహో’కు వచ్చిన ఓపెనింగ్స్‌కు, ఇప్పుడు వచ్చిన ఆరంభ వసూళ్లకు పొంతనే కనిపించడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వరకు ‘రాధేశ్యామ్’ ఓపెనింగ్స్ ఓకే అనిపిస్తున్నా.. వేరే ప్రాంతాల్లో మాత్రం మరీ పూర్‌గా అనిపిస్తున్నాయి. ఉత్తరాది ప్రేక్షకులకైతే ‘రాధేశ్యామ్’ మీద ఏమాత్రం ఆసక్తి లేదనిపిస్తోంది.

అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కీలక పాత్రల్లో వేరే నటీనటుల్ని పెట్టి.. అలాగే సంగీతం కూడా వేరే వాళ్లతో చేయించుకుని ఎంతగా ‘రాధేశ్యామ్’కు అక్కడి వాళ్లకు నచ్చేలా తీర్చిదిద్దినా ఆ ప్రయత్నం పెద్దగా ఫలించినట్లు లేదు. కొన్నేళ్ల నుంచి మాస్ మసాలా, యాక్షన్ ప్రధాన సినిమాలనే ఎక్కువ ఆదరిస్తున్న అక్కడి ప్రేక్షకులకు ‘రాధేశ్యామ్’ లాంటి క్లాస్ లవ్ స్టోరీ పట్ల ఆసక్తి లేదని అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే తేలిపోయింది.

ఇక వసూళ్లు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా తెలిసిపోతోంది.‘సాహో’తో పోలిస్తే తొలి రోజు హిందీలో ‘రాధేశ్యామ్’ వసూళ్లు నాలుగో వంతు కూడా లేకపోవడం అనూహ్యం. ‘సాహో’ తొలి రోజు నార్త్ ఇండియాలో హిందీ వెర్షన్ ద్వారా రూ.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం. కానీ ‘రాధేశ్యామ్’ హిందీ వెర్షన్ డే-1 నెట్ కలెక్షన్లు కేవలం 4.6 కోట్లు మాత్రమేనట. ‘సాహో’కు డిజాస్టర్ టాక్ వచ్చినా.. ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టగా, దాంతో పోలిస్తే ‘రాధేశ్యామ్’కు బెటర్ టాకే వచ్చినా కలెక్షన్లు ఇంత అథమ స్థాయిలో ఉన్నాయి.

మారుతున్న ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచిని ‘రాధేశ్యామ్’ అర్థం చేసుకోలేకపోయిందన్నది స్పష్టం. పరిస్థితి చూస్తుంటే ‘రాధేశ్యామ్’కు 20-25 కోట్లకు మించి నెట్ కలెక్షన్లు వచ్చేలా లేదు. ‘సాహో’ అంత బ్యాడ్ టాక్‌తోనూ అక్కడ రూ.150 కోట్ల మార్కును టచ్ చేసి హిట్ స్టేటస్ అందుకోవడం విశేషం. దీన్ని బట్టి ప్రభాస్ మళ్లీ ఇలాంటి క్లాస్ లవ్ స్టోరీల జోలికి వెళ్లకపోవడమే మంచిది. తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అదే ఇస్తే బెటర్.

This post was last modified on March 12, 2022 4:52 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

25 minutes ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

3 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

8 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

9 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

9 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

9 hours ago