హమ్మయ్య.. సమస్య పరిష్కారం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లకు సంబంధించి కొత్త రేట్ల జీవో వచ్చేసింది. హీరో హీరోయిన్లు, దర్శకుడి పారితోషకం కాకుండా వంద కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలకు తొలి పది రోజులు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం కూడా ఇచ్చేశారు. ఇంకేముంది ఈ శుక్రవారం రిలీజవుతున్న భారీ చిత్రం రాధేశ్యామ్‌కు ప్రయోజనం దక్కబోతోందని ఆ సినిమాను నమ్ముకున్న వాళ్లంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
కానీ వారి ఉత్సాహంపై నీళ్లు చల్లేసింది జగన్ సర్కారు. ఆంధ్రప్రదేశ్‌లో 20 శాతం షూటింగ్ జరిగిన చిత్రాలకే ఈ ఆఫర్ అంటూ జీవోలో పెట్టిన మెలికను బయటికి తీసి ఆ చిత్రానికి రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా చేశారు. మార్చి 25న రాబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా ఇదే వర్తించబోతోంది. సాధారణ రేట్లకే ఈ సినిమా టికెట్లనూ అమ్మక తప్పదు.
ఐతే ఎప్పుడో రెండు మూడేళ్ల ముందు షూటింగ్ మొదలుపెట్టుకుని గత ఏడాదే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రాలకు నిన్న కాక మొన్న రిలీజైన జీవోను వర్తింపజేయడం.. ఏపీలో 20 శాతం షూటింగ్ అనే మెలిక పెట్టి వాటికి గండి కొట్టడం ఏం లాజిక్కో అర్థం కావడం లేదు జనాలకు. నిజానికి ఈ విషయం ఇంతకుముందే చర్చకు వచ్చింది. ఈ రెండు చిత్రాలూ ముందే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి కాబట్టి వీటికి ఆ నిబంధన వర్తించదని, రేట్లు పెంచుకోవచ్చని మంత్రి పేర్ని నాని స్పష్టత ఇచ్చారు.
కానీ రాధేశ్యామ్ రిలీజ్ టైంకి కథ మారిపోయింది. రేట్ల పెంపుతో టికెట్లు అమ్ముదామని.. ఈ మేరకు స్పష్టత వస్తుందని.. ఈ సినిమాకు బుధవారం వరకు బుకింగ్సే ఓపెన్ చేయలేదు ఎక్కడా. గురువారం కూడా మధ్యాహ్నం వరకు ఎక్కడా బుకింగ్సే మొదలు కాలేదు. కానీ రేట్ల పెంపు లేదని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో సాయంత్రం హడావుడిగా సాధారణ రేట్లతో బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ ఆలస్యం వల్ల వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
This post was last modified on March 10, 2022 10:37 pm
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…