Movie News

కీర్తి మీదే ఆశలు.. ఏం చేస్తుందో?

కీర్తి సురేష్ వైపు దక్షిణాది సినీ పరిశ్రమ ఆశగా చూస్తోందిప్పుడు. ఆమె సినిమా ‘పెంగ్విన్’ ఇంకొన్ని గంటల్లోనే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది. థియేటర్లు కొన్ని నెలలుగా మూత పడి ఉండటం, ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవకాశం లేకపోవడంతో కొందరు నిర్మాతలు ధైర్యం చేసి తమ సినిమాల్ని నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేసేస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగులో ‘అమృతారామ్’ అనే చిన్న సిినమాతో మొదలుపెట్టి.. హిందీలో అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద నటుడు చేసిన ‘గులాబో సితాబో’ వరకు గత రెండు నెలల్లో అరడజను సినిమాలకు పైనే నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. కానీ వీటిలో ఏదీ అంత మంచి ఫలితాన్నందుకోలేదు.

‘గులాబో సితాబో’ సైతం మిక్స్‌డ్ రివ్యూసే తెచ్చుుకంది. ఓపెనింగ్ బాగానే అనిపించినా.. ఆ తర్వాత సినిమా గురించి పెద్దగా చర్చ లేదు. దీంతో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌ సినిమాల్లో తొలి విజయం కోసం ఎదురు చూపులు తప్పట్లేదు.

ఈ స్థితిలో కీర్తి సురేష్ సినిమా ‘పెంగ్విన్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రైమ్‌లో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ‘పెంగ్విన్’ రిలీజవుతుంది. ఇప్పటిదాకా దక్షిణాదిన ఇలా రిలీజైన సినిమాల్లో అత్యధిక అంచనాలున్న చిత్రం ఇదే. కార్తీక్ సుబ్బరాజ్ లాంటి ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈశ్వర్ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.

దీని టీజర్, ట్రైలర్ చాలా ఉత్కంఠభరితంగా అనిపించాయి. ఒక సీరియల్ కిల్లర్ చేతికి చిక్కిన తన కొడుకును కాపాడుకోవడానికి ఓ త్లలి ఎలా పోరాడిందనే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రోమోలు చూస్తే చాలా థ్రిల్లింగ్‌గా, గ్రిప్పింగ్ అనిపించిన నేపథ్యంలో సినిమా కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నారు.

‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటిదాకా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ సినిమాల విషయంలో బాగా లేని శకునాన్ని ‘పెంగ్విన్’ మారుస్తుందని ఆశ. చూద్దాం ఏమవుతుందో?

This post was last modified on June 18, 2020 1:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago